By: ABP Desam | Updated at : 30 May 2023 01:14 PM (IST)
Edited By: jyothi
మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు, సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం! ( Image Source : ప్రతీకాత్మక చిత్రం )
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంది. అయితే మనీష్ సిసోడియా మాత్రం ఢిల్లీ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వాస్తవానికి దిగువ కోర్టు నిర్ణయాన్ని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సవాలు చేశారు. దానిపై ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు సాక్ష్యాధారాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మనీష్ సిసోడియా తీరు సరికాదని ధర్మాసనం పేర్కొంది. వారు సాక్ష్యాలను ప్రభావితం చేే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వడం లేదని వివరించింది.
Former Delhi's Deputy Chief Minister Manish Sisodia to move to Supreme Court against Delhi High Court's decision on bail
— ANI (@ANI) May 30, 2023
Delhi HC rejected his bail plea in the CBI case alleging corruption in the implementation of previous liquor policy in national capital. https://t.co/GsYNTJfxzQ
మనీష్ సిసోడియా మద్యం కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. జస్టిస్ దినేష్ శర్మ.. సిసోడియా అభ్యర్థనను తిరస్కరిస్తూ, అతను ప్రభావవంతమైన పదవిలో ఉన్నాడని, సాక్ష్యాలను తారుమారు చేయగల అవకాశాలు ఎక్కువగా ఉన్నందున బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత విచారణలో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ కేసులో తీర్పును మే 11న కోర్టు రిజర్వ్ చేసింది.
Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!
AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే
Maharashtra Hospital Deaths: మహారాష్ట్ర ఆస్పత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
సోనియా గాంధీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
/body>