Manipur Violence: నా గుండె రగిలిపోతోంది, ఎవరినీ వదిలిపెట్టం - మణిపూర్ హింసపై ప్రధాని మోదీ
Manipur Violence: మణిపూర్ హింసకు కారణమెవరైనా వదిలిపెట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Manipur Violence:
మణిపూర్‌లో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన హింసాత్మక ఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళను నగ్నంగా రోడ్లపై తిప్పిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా ఆవేశంగా మాట్లాడారు మోదీ. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మణిపూర్‌లో జరిగిన దారుణం...మొత్తం దేశానికే కళంకం అని అన్నారు.
"మణిపూర్‌లో జరిగిన ఘటన దేశంలోని 140 కోట్ల ప్రజలందరికీ సిగ్గుచేటు. నిందితులను వదిలిపెట్టమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి నా గుండె మండుతోంది. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా శాంతి భద్రతల్ని కాపాడడంపై దృష్టి పెట్టాలి. మణిపూర్‌లోని మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించం"
- ప్రధాని నరేంద్ర మోదీ
"Will never forgive those who are behind this:" PM Modi speaks on Manipur video
— ANI Digital (@ani_digital) July 20, 2023
Read @ANI Story | https://t.co/8D04cGCgdH#PMModi #Manipur #Parliament #MonsoonSession2023 pic.twitter.com/45tBpwGkd4
రెండు నెలల క్రితం మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై ఓ గుంపు దాడి చేసి నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దారుణం మే 4 నాటిదని పోలీసులు చెబుతున్నారు. కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్ పోలీస్ స్టేషన్లో ఆ గ్రామ పెద్ద ఈ దుర్ఘటనపై ఫిర్యాదు చేశారని... జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది తౌబాల్‌లోని నాంగ్‌పోక్ సెక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని అంటున్నారు. ఈ భయంకరమైన దాడి వీడియో వైరల్ కావడంతో స్థానిక గిరిజన నాయకుల ఫోరం (ITLF) ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను స్పందించాలని అభ్యర్థించింది. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన మొదట్లో ఇలాంటివి చాలా జరిగాయని ఐటీఎల్ఎఫ్ సభ్యులు తెలిపారు.
మే 3 నుంచి హింస..
ప్రశాంతతకు నెలవైన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3వ తేదీన ఒక్కసారిగా హింస చెలరేగింది. ఇక్కడి జనాభాలో అత్యధికులు మెయిటీ, కుకీ తెగదల మధ్య వైరం మొదలైంది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటూ సృష్టించిన హింసలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికార లెక్కల ప్రకారమే 140 మంది వరకు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌కు చెందిన 165 కాలమ్‌లు (ఒక్కొక్కటి 35-40 మంది సిబ్బంది) మణిపూర్ రాష్ట్రంలో మోహరించారు. అదనంగా 57 కంపెనీలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 48 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, నాలుగు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ రాష్ట్రంలో మోహరించారు. ఒక్కో కంపెనీలో దాదాపు 100 మంది సిబ్బంది ఉంటారు.