Madhya Pradesh High Court: హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్- 110 ఏళ్లు జైలు శిక్ష వేసిన న్యాయస్థానం
స్కాములు చేసేవారికి గుణపాఠం చెబుతూ జబల్ పూర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎంపీ హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చిన వ్యక్తికి 110 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ఇటీవల అమాయకులు, నిరుద్యోగుల అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగాలు పేరుతో టోకరా వేస్తున్నారు. లక్షలు వసూలు చేస్తూ అమాయకుల జేబు కొడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు చేయడమే ఆలస్యం రంగంలోకి దిగుతున్నారు మోసగాళ్లు. తనకు మంత్రులు తెలుసని, ఎమ్మెల్యే బాగా క్లోస్ అని, ఈజీతా ఉద్యోగం ఇప్పిస్తామంటూ యువతను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన చుట్టుపక్కలే చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిని నమ్మి చాలా మంది మోసపోతుంటారు. కొందరు తెలుసుకుని న్యాయం కోసం పోరాడతారు.
కొన్ని సార్లు కోర్టులు సైతం సంచలన తీర్పులు ఇస్తూ ఉంటాయి. ఓ కేసులో రెండు మూడు జీవిత ఖైదులు విధిస్తారు. మరికొన్ని జనాల్లోకి సులువుగా వెళ్లిపోతుంటాయి. సాధారణంగా భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఓ కోర్టు దానికి విరుద్ధంగా సంచనల తీర్పు వెలువరించింది. భర్త కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న భార్య.. తన భర్తకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇలాంటి తీర్పులు వార్తల్లో ప్రముఖంగా ఉంటాయి.
స్కాములు చేసేవారికి గుణపాఠం చెబుతూ జబల్ పూర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎంపీ హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.5,000 నుంచి రూ.30,000 వరకు వసూలు చేసిన వ్యక్తికి 110 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరుద్యోగులను మోసం చేసిన వారికి ఇలాంటి శిక్షలే సరైనవి అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితుడు పాసి పురుషోత్తం ఎంపీ హైకోర్టు పేరుతో 100 మందికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చాడు. తీరా ఉద్యోగంలో చేరడానికి వెళ్లినప్పుడు అసలు విషయం తెలిసింది. దీంతో న్యాయం చేయాలంటూ మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం పేరుతో మోసగించారని వాపోయారు. దీంతో పురుషోత్తంపై పోలీసులు 15 కేసులు నమోద చేశారు. ఈ కేసులో అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి అభిషేక్ సక్సేనా నిందితుడు పురుషోత్తంకు IPC సెక్షన్ 420 కింద ప్రతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, IPC సెక్షన్లు 467, 471 కింద మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ శిక్షలు ఏకకాలంలో ఉండవు. వరుసగా ఉంటాయని పేర్కొంది. మొత్తం 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానితో పాటు 15,000 జరిమానా సైతం విధించారు.
మహిళకు ఉపశమనం
ఇదే కేసులో ఓ మహిళకు కోర్టు ఉపశమనం కలిగించింది. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ల తయారీలో ఓ మహిళ హస్తం ఉందని పురుషోత్తం కేసు విషయంలో నష్టపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల ఆశ చూపించి నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చారని, అందులో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు 2013 డిసెంబర్ 18న కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం సాక్ష్యాధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. మహిళను నిర్దోషిగా ప్రకటించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial