Uttar Pradesh News: భార్యను 3 కిమీ బండిలో లాక్కెళ్లిని పెద్దాయన- అంబులెన్స్ లేక ఎండలో పాట్లు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అంబులెన్స్ లేక ఓ పెద్దాయన తన భార్యను ఎద్దుల బండిలో 3 కిమీ లాక్కొని ఎండలో తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ ఫొటో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఎండలో ఓ వృద్ధుడు బండిలో పడుకోబెట్టి లాక్కొని ఆసుపత్రికి తీసుకువెళ్తోన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి రావడంతో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాతక్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.  

ఏం జరిగింది?

బల్లియాలోని చిల్‌కర్‌ బ్లాక్ అందౌర్ గ్రామానికి చెందిన సకుల్ ప్రజాపతి.. తన భార్య జోగిని (55)ని మార్చి 28న ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే అంబులెన్స్‌ లేకపోయేసరికి ఎద్దులబండిని తానే లాక్కొని 3 కిమీ దూరంలో ఉన్న హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఈ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో దీనిపై దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

" బల్లియాకు చెందిన ఓ వీడియో వైరల్ అయింది. ఓ ముసలతను తన భార్యను బండిలో లాక్కుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీనిపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్‌ను ఆదేశించాను. ఆయనకు ఇబ్బంది కలగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపాను.                                                     "
-   బ్రజేశ్ పాతక్, యూపీ డిప్యూటీ సీఎం

ఫలితం శూన్యం

అయితే అంత కష్టపడి తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆ పెద్దాయనకు బాధే మిగిలింది. తన భార్యకు మందులు ఇచ్చి జిల్లా ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు, ఆయనకు తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే విడిచి పెట్టి మళ్లీ ఇంటికి వెళ్లి డబ్బులు, బట్టలు తీసుకువచ్చాడు ప్రజాపతి. ఆ తర్వాత మినీ ట్రక్‌లో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఆ తర్వాత 

ప్రజాపతి భార్య రాత్రి 11 గంటల సమయంలో చనిపోయింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ను కోరగా రాత్రి వేళల్లో సేవలు లేవని ఆసుపత్రి చెప్పింది. దీంతో రూ.1100 ఇచ్చి ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.

అఖిలేశ్ విమర్శలు

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. యోగి నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు అందించలేకపోతుందని విమర్శించారు. 

Published at : 05 Apr 2022 07:12 PM (IST) Tags: Yogi Adityanath Uttar Pradesh news Man Carrying Wife To Hospital On Cart UP Video Goes Viral Deputy CM Orders Probe Brajesh Pathak ballia news Man Carries Wife On Cart

సంబంధిత కథనాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

SonuSood Foundation :  ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్

IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

IAS Couple Dog :  ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ?   బదిలీ అయిన  ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!