అన్వేషించండి

సొంత పార్టీ నేతలపై విమర్శలు వద్దు, మీడియా వరకూ వెళ్లొద్దు - ఖర్గే ఉపదేశం

Mallikarjun Kharge: సొంత నేతలపై విమర్శలు చేయొద్దని మీడియా వరకూ వెళ్లొద్దని ఖర్గే పార్టీ నేతలకు సూచించారు.

Mallikarjun Kharge: 


మీడియా వరకూ వెళ్లొద్దు..

విపక్ష కూటమి 14 న్యూస్ ఛానల్స్‌కి చెందిన యాంకర్స్‌ని నిషేధించడంపై దేశవ్యాప్తంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ తీరే ఇది అని బీజేపీ మండి పడుతోంది. మీడియాని బైకాట్ చేయడమేంటని ప్రశ్నిస్తోంది. దీనిపై కాంగ్రెస్ వివరణ ఇస్తున్నప్పటికీ..విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. సొంత నేతలపైనే విమర్శలు చేస్తూ మీడియాకి బైట్స్‌, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరుగుతున్న క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారు. అంతా ఒక్కటిగా ఉండడం ఎంతో అవసరమని, అనవసరంగా సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణతోనే విజయం సాధిస్తామని, కర్ణాటకలో ఇది రుజువైందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో అందరూ ఒకే విధంగా నిలబడాలని, అనవసరంగా కన్‌ఫ్యూజన్‌ క్రియేట్ చేయొద్దని రాహుల్ గాంధీ కూడా ఉపదేశించినట్టు సమాచారం. ఈ క్లారిటీ కోసమే వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. BJP ట్రాప్‌లో పడి అనవసరపు వివాదాల్లో చిక్కుకోవద్దని రాహుల్ చెప్పినట్టు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా వెల్లడించారు. 

I.N.D.I.A కూటమి 14  న్యూస్ యాంకర్‌లపై నిషేధం విధించడంపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ తీరు ఇదే అంటూ బీజేపీ ఇప్పటికే మండి పడుతోంది. మీడియాని నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. మీడియాపై నిషేధం విధించడం పిల్లలాటగా ఉందని, కాంగ్రెస్‌కి ఇదేం కొత్త కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియాపై సెన్సార్ విధిస్తారని హెచ్చరించారు. 1975 నాటి రోజుల్ని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేస్తోందని అన్నారు. 

"మీడియాని బైకాట్ చేయడం చూస్తుంటే 1975 నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి. కాంగ్రెస్‌కి ఇదేం కొత్త కాదు. గుర్తుంచుకోండి. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా మీడియాపై ఆంక్షలు విధిస్తుంది. సెన్సార్‌షిప్‌తో అణిచివేస్తుంది"

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

ఇటీవలే విపక్ష కూటమి తాము బ్యాన్ చేస్తున్న 14 న్యూస్ ఛానల్స్ లిస్ట్‌ని విడుదల చేసింది. ఈ బ్యాన్‌ విధించడంపై వివరణ ఇచ్చారు కూటమి నేతలు. వాళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, విద్వేషాలు ప్రచారం చేస్తున్నారని అందుకే నిషేధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. తమ కూటమి నేతలు ఆయా ఛానల్స్‌కి ఇంటర్వ్యూలకు వెళ్లరని, ఆ ప్రతినిధులనూ తమ కార్యక్రమాలకి పిలవబోమని క్లారిటీ ఇచ్చారు. ఇది నిషేధం కాదని, కేవలం దూరం పెట్టడం మాత్రమేనని చెప్పారు. ఒకవేళ వాళ్లు పక్షపాతంగా కాకుండా ఉన్నది ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తే కచ్చితంగా ఈ నిషేధం ఎత్తివేస్తామని అన్నారు. బీజేపీ ప్రతినిధులు మాత్రం విమర్శలు ఆపడం లేదు. దేశంలోని ప్రతి సంస్థపైనా విపక్ష కూటమి దాడి చేస్తోందని, ఇప్పుడు మీడియా విషయంలోనూ టార్గెట్ లిస్ట్ తయారు చేసుకుందని మండి పడుతున్నారు. 

Also Read: Third Front Alliance: కేసీఆర్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్? అసదుద్దీన్ ఒవైసీ హింట్ ఇచ్చారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget