Madhya Pradesh :డిగ్రీలతో ప్రయోజనం లేదు- పంక్చర్ షాపులు పెట్టుకోండి- బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
BJP Guna MLA Pannalal Shakya: ఎప్పుడూ వివాదాల్లో ఉండే బీజేపీ ఎంపీ మరోసారి అలాంటి కామెంట్స్ చేసి వైరల్‌గా మారారు. ఇప్పుడు ఏకంగా డిగ్రీలు వద్దు పంక్చర్ షాపులు పెట్టుకోమని సలహా ఇస్తున్నారు.

BJP MLA Pannalal Shakya Comments: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. విద్యార్థుల కోసం మోటార్ సైకిల్స్ రిపేర్ చేసే షాపులు, పంక్చర్ షాపులు తెరవాలన్న ఆయన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్సీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య సంచలన కామెంట్స్ చేశారు. డిగ్రీలు చదవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి యూజ్ లేదని అందుకే సైకిల్ రిపేర్ షాపులు పెట్టుకోవాలని సూచనలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
బీజేపీ ఎమ్మెల్యే శాక్య ఏమన్నారంటే... "ఇవాళ పీఎం కాలేజీ ఆప్ ఎక్స్‌లెన్సీ ప్రారంభించాం. అందరికీ ఒక మాట చెబుతాను వినండి... డిగ్రీలు చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మోటార్ సైకిల్ రిపేర్, పంక్చర్ షాపు లాంటివి పెట్టుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చని" సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి కూడా పాల్గొన్నారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాక్య చేసిన కామెంట్స్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి.
Before You Go
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
ట్రెండింగ్ వార్తలు






















