News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

2014 నాటి బీజేపీ కాదిది, 9 ఏళ్లలో ఎన్నో మార్పులు - మోదీ మేనియాతో మారుతున్న మేనిఫెస్టోలు

BJP Evolution: 2014 నాటితో పోల్చి చూస్తే బీజేపీలో ప్రస్తుతానికి చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Lok Sabha Election: 

2014లో బీజేపీ మేనిఫెస్టో ఇదే..

2014 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆ స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్‌ పతనం అప్పుడప్పుడే మొదలవుతున్న సమయంలో పొలిటికల్ వాక్యూమ్‌ని భర్తీ చేసింది కాషాయ పార్టీ. ఓ అవకాశం ఇచ్చి చూద్దాం అని ప్రజలు అనుకునేలా చేసింది. ఆ అవకాశమే అధికారం తెచ్చి పెట్టింది. 9 ఏళ్లు గడిచిపోయాయి. రెండు సార్లు బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు సార్లూ బీజేపీ గద్దెనెక్కడానికి కారణం...పార్టీ ఎజెండాయే. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే..2014 మేనిఫెస్టోతో పోల్చి చూస్తే..బీజేపీ ఎజెండాలో చాలా మార్పులు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 52 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది. దాదాపు 549 హామీలిచ్చింది. Ek Bharat,Shreshtha Bharat పేరిట ఈ హామీ పత్రం విడుదల చేసింది. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. అదే 2019 విషయానికొస్తే...45 పేజీల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. అందులో 75 హామీలిచ్చింది. దీనికి Sankalpit Bharat,Sashakt Bharat అని పేరు పెట్టింది. ఈ రెండు మేనిఫెస్టోల గురించి ఓ కీలక అంశం చెప్పుకోవాలి. మొదటి మేనిఫెస్టో కవర్‌ పేజ్‌లో ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీతో పాటు ఎల్‌కే అద్వాణి, వాజ్‌పేయీ సహా మరి కొందరు కీలక నేతల ఫొటోలను ప్రచురించింది బీజేపీ. "ఇదే మా సైన్యం" అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ...2019 నాటికి పొలిటికల్ సీన్ అంతా మారిపోయింది. ప్రధాని మోదీ చరిష్మా అమాంతం పెరిగిపోయింది. అసలు బీజేపీకి అసలు సిసలు బలం మోదీయే అన్న అభిప్రాయం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకుంది బీజేపీ. 2019 మేనిఫెస్టో కవర్‌ పేజ్‌పై ప్రధాని మోదీ తప్ప ఇంకెవరూ కనిపించలేదు. "మోదీయే లీడర్" అన్న సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది. 

అంతా మోదీ జపమే..

ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 2019 మేనిఫెస్టోలో మోదీ పేరు దాదాపు 26 చోట్ల ప్రస్తావించింది. అంటే పూర్తిగా ప్రధాని మోదీని నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగింది. 2014లో కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పి వలస వెళ్లిన కశ్మీరీ పండిట్‌లను వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. కానీ..ఎక్కడా ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావించలేదు. ఇక ఫారన్ పాలసీ విషయంలోనూ 2014,2019లో చాలా మార్పులు వచ్చాయి. 2014లో Brand India విధానం అమలు చేసిన బీజేపీ...2019 నాటికి విదేశాంగ విధానాన్ని మార్చేసింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కి శాశ్వత సభ్యత్వం లాంటి కీలక అంశాలను చేర్చింది. 2019లో మోదీ సర్కార్ ఇచ్చిన అతి పెద్ద హామీ...రైతుల ఆదాయం రెట్టింపు చేయడం. ఉద్యోగాల కల్పన, స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం లాంటి అంశాలనూ ప్రస్తావించింది. ఆ తరవాత డిజిటల్ ఇండియాపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. మహిళల భద్రతనూ హామీ ఇచ్చింది. నల్లధనాన్ని బయటకు తీస్తామని చెప్పి అందుకు తగ్గట్టుగానే పెద్ద నోట్ల రద్దు (Demonetisation) చేసింది. ఈ ఫలితాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే...మెల్లగా ప్రజలు అలవాటుపడిపోయారు. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చాక బీజేపీ హయాంలో రెండు అతి పెద్ద సమస్యలు పరిష్కారమయ్యాయి. ఒకటి అయోధ్య రామ మందిరం, రెండోది ఆర్టికల్ 370 రద్దు. ట్రిపుల్ తలాఖ్‌నీ రద్దు చేసింది. కేవలం నాలుగైదు నెలల గ్యాప్‌లోనే ఈ కీలక పరిణామాలు జరిగాయి. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం అప్పట్లో సంచలనమైంది. అయోధ్య రామ మందిర నిర్మాణం కేవలం BJP అజెండా మాత్రమే కాదు. RSS కల కూడా. 

RSS భావజాలం..

2014 మేనిఫెస్టో గమనిస్తే దాదాపు RSS భావజాలం అందులో స్పష్టంగా కనిపించింది. యునిఫామ్ సివిల్ కోడ్‌ అమలు, అయోధ్య రామ మందిర నిర్మాణంపై బాగా ఫోకస్ చేసింది. ఫస్ట్ టర్మ్‌లోనే కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టింది. Article 370ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 2014 మేనిఫెస్టోపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. RSS ఐడియాలజీని తీసుకొచ్చి ఎన్నికల హామీల్లో చేర్చారని చాలా మంది వాదించారు. కానీ బీజేపీ మాత్రం అవేం పట్టించుకోలేదు. తమ ఎజెండా ఏంటో చాలా క్లారిటీగా ప్రజలకు వివరించింది. 2014 మేనిఫెస్టోలోనే GST గురించి ప్రస్తావించింది బీజేపీ. ట్యాక్స్‌ సిస్టమ్‌నీ సింప్లిఫై చేస్తామని హామీ ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో ఈ హామీలన్నీ నెరవేరాలంటే మరోసారి తమను ఎన్నుకోవాలని ప్రచారం చేసింది. అప్పటికే ఓటర్లకు బీజేపీపై కాస్త నమ్మకం ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ బలంగా లేకపోవడమూ కలిసొచ్చింది. ఫలితంగా...ఓటర్లు 2019లో మరోసారి బీజేపీకే పట్టంకట్టారు. ఈ ఐదేళ్లలో పార్టీ విధానాల్లో చాలా మార్పులొచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోడానికి బలమొచ్చింది. ప్రజలు తమను చాలా గట్టిగా నమ్ముతున్నారన్న ధీమా బీజేపీలో బలపడిపోయింది. విదేశాంగ విధానంలో సంస్కరణలు చేసింది. మోదీ చరిష్మా రెట్టింపైంది. పైగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ హవాని కొనసాగించింది. క్యాడర్‌ని పెంచుకుంది. అందుకే ఈ సారి కచ్చితంగా తమనే ప్రజలు ఎన్నుకుంటారని ప్రధాని మోదీ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సారి ఇంకా మేనిఫెస్టోని ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి 2014 నాటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ వచ్చారు. 

Also Read: బీజేపీ యుద్ధానికి ప్రతిపక్షాలే స్వయంగా అస్త్రాలు అందిస్తున్నాయా? కమల దళానికి అదే కలిసొస్తోందా?

Published at : 20 Sep 2023 12:25 PM (IST) Tags: BJP PM Modi Lok Sabha Election 2024 Lok Sabha Election BJP Manifestoes BJP Evolution

ఇవి కూడా చూడండి

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Live-in relationship: సహజీవనం, ప్రేమ పెళ్లిలను నిషేధించేలా చట్టం చేయాలి - లోక్‌సభలో బీజేపీ ఎంపీ డిమాండ్‌

Live-in relationship: సహజీవనం, ప్రేమ పెళ్లిలను నిషేధించేలా చట్టం చేయాలి - లోక్‌సభలో బీజేపీ ఎంపీ డిమాండ్‌

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?