అన్వేషించండి

Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ

Space News: అంగారకగ్రహం మాదిరిగానే భూమికి కూడా రెండో చంద్రుడు వచ్చాడు.ఇవాళ్టి నుంచి నవంబర్ 25 వరకు చంద్రుడితో పాటు భూకక్ష్యలో అర్జున ఆస్టెరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన 2024PT5 గ్రహశకలం పరిభ్రమించనుంది.

Like Mars Earth has Second Moon: సౌర మండలంలోని కొన్ని ఇతర గ్రహాల మాదిరే భూమికి కూడా ఒకటికి మించి చందమామలు కలిగి ఉండే అనుభూతి ఇవాళే(సెప్టెంబర్‌ 29) మరోసారి సాకారమైంది. ఇప్పుడున్న మూన్‌తో పాటే భూమికి రెండో మూన్‌ కూడా వచ్చింది. అయితే ఇది 56 రోజులు మాత్రమే ఉంటుంది. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న 2024PT5 గా పిలిచే ఒక ఆస్టరాయిడ్‌ నేటి నుంచి నవంబర్ 25 వరకు దాదాపు 8 వారాల పాటు భూకక్ష్యలో పరిభ్రమించనుంది. ఆ తర్వాత మళ్లీ తన దిశను మార్చుకొని తిరిగి సూర్యుడి కక్ష్యలో పరిభ్రమిస్తుంది.

ఈ రెండో మామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు..?

మినిమూన్ ఈవెంట్స్‌పై నిరంతరం పరిశోధనలు చేసే స్పెయిన్‌లోని డి మాడ్రిడ్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త కార్లోస్ బృందం కొన్నేళ్లుగా ఈ మినీ మూన్ ఈవెంట్స్‌పై పరిశోధన చేస్తోంది. 2024PT5 గ్రహశకలం అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌కు చెందిందని కార్లోస్ తెలిపారు. ఈ బెల్ట్ స్పేస్‌లో ఉన్న రెండో ఆస్టరాయిడ్ బెల్ట్‌. ఇది సూర్యుడికి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంటుంది. అంతే కాకుండా ఈ బెల్ట్ భూ కక్ష్యకు దగ్గరగా ఉండడం వల్ల అప్పుడప్పుడూ ఈ బెల్ట్‌లోని గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుంటాయి. కొన్నాళ్లపాటు చంద్రుడితో పాటు ఇవి కూడా భూమి చుట్టూ తిరుగుతూ సెకండ్ మూన్ అనుభూతిని భూమికి కలిగిస్తుంటాయి. అయితే ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ 2024పీటీ5 గ్రహశకలం భూమి చుట్టూ పూర్తి భ్రమణం చేయదు. మధ్యలోనే సూర్యుడి గురుత్వాకర్షణకు గురై సూర్యుడి కక్ష్యలోకి వెళ్లిపోతుందని కార్లోస్ మార్కోస్ వివరించారు.

ఈ రెండో చందమామను తొలుత ఎవరు గుర్తించారు:

ఈ 2024PT5 గ్రహశకలాన్ని తొలిసారి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. గ్రహశకలాల కోసం అది చేపట్టిన ఆస్టరాయిడ్ టెరెన్షియల్ ఇంపాక్ట్‌ లాస్ట్ అలెర్ట్ సిస్టమ్‌ - అట్లాస్ దీనిని తొలి సారి ఆగస్టు 7న గుర్తించింది. ఇది దాదాపు 33 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇలాంటి ఆస్టరాయిడ్స్‌ భూమికి 45 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంటాయి. ఒక వేళ అర్జున బెల్టులోని ఈ ఆస్టరాయిడ్లు గంటకు కేవలం 3 వేల 540 కిలోమీటర్ల వేగంతోనే పరిభ్రమిస్తూ ఉంటే అవి భూ గురుత్వాకర్షణ శక్తికి గురై భూ కక్ష్యలోకి వస్తుంటాయి. ఐతే ఈ గ్రహాలు తాత్కాలికంగా కొంత కాలం భూ కక్ష్యలో ఉండి మళ్లీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూ కక్ష్యను వదిలి సూర్యుడి కక్ష్యలోకి వెళ్తుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుతం వస్తున్న గ్రహశకలం ఈ కారణాలతోనే భూ గ్రహం చుట్టూ రెండు నెలలు పరిభ్రమిస్తుంది. ఐతే ఇలాంటి సెకండ్ మూన్ ఈవెంట్‌లు భూమికి కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 2022 NX 1 గ్రహశకలం 1981లో ఒకసారి ఆ తర్వాత 2022లో ఒకసారి భూ కక్ష్యలోకి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్లాయి. ఇవాళ్టి నుంచి కనిపించే 2024పీటీ5 గ్రహశకలం కూడా రెండు నెలల్లో భూకక్ష్య నుంచి వెనక్కి వెళ్లినా మళ్లీ తిరిగి 2055లో భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మినీ మూన్ ఈవెంట్స్ ఎన్నిరకాలు:

మినీ మూన్ ఈవెంట్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. సుదీర్ఘ కాలం ఉండేవి, స్వల్పకాలం ఉండేవి. సుదీర్ఘ కాలం మినీ-మూన్ ఈవెంట్స్ దాదాపు ఏడాది లేదా అంతకు మించిన ఎక్కువ సమయం ఉంటాయి. స్వక్పకాలిక మినీ మూన్ ఈవెంట్స్‌ వారాలు లేదా కొద్ది నెలలు మాత్రమే సంభవిస్తాయి. సుదీర్ఘకాలపు మినీ మూన్ ఈవెంట్స్ ప్రతి పదేళ్లకు లేదా ఇరవై ఏళ్లకు జరుగుతుంటాయి. స్వల్పకాలిక మినీమూన్ ఈవెంట్స్ మాత్రం ఒక దశాబ్దంలో పలుమార్లు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బలంగా ఈ ఆస్టరాయిడ్స్‌పై ఉండడం వల్ల అవి తిరిగి సూర్యుడి కక్ష్యలోకి వెళ్తుంటాయి.

రెండో మూన్‌ను చూడగలమా..?

రెండో మూన్‌ను చందమామ లాగే చూడగలమా అంటే కష్టసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెచ్యూర్ టెలిస్కోప్స్‌, బైనాక్లోర్స్ సాయంతో ఈ 2024PT5 ను చూడలేమని మార్కోస్ తెలిపారు. పెద్ద టెలిస్కోప్‌లు, ఇతర అధునాత ఎక్విప్‌మెంట్ సాయంతో స్పేస్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని చూడగలరు. 30 ఇంచెస్ డయామీటర్ ఉన్న CCD లేదా CMOS డిటెక్టర్ ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ రెండో చందమామను చూడగలమని చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 2024PT5ను ఫొటోమెట్రిక్‌, స్పెక్ట్రోమెట్రిక్ విశ్లేషణ చేయడం సహా శాస్త్రవేత్తలకు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్‌మీద పరిశోధన చేసి మన సోలార్ సిస్టమ్‌లోని ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

Also Read: Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Pak Toss Update: టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Mazaka Trailer: ‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Pak Champions Trophy 2025 | కింగ్ విరాట్ కొహ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా | ABP DesamInd vs Pak Head to Head Records | Champions Trophy 2025 భారత్ వర్సెస్ పాక్...పూనకాలు లోడింగ్ | ABPSLBC Tunnel Incident Rescue | ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో మొదలైన రెస్క్యూ ఆపరేషన్ | ABP డిసంAPPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Pak Toss Update: టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
టీమిండియా బౌలింగ్.. పాక్ తో కీలక మ్యాచ్.. గెలిస్తే దాదాపు సెమీస్ కు.. పాక్ కు చావోరేవో
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Mazaka Trailer: ‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
‘బాలయ్య బాబు ప్రసాదం.. చాలా ఫన్ ఉంది’.. సందీప్ కిషన్ ‘మజాకా’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Shivoham: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
How To Live Longer: మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
Ajith Car Crash: రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
Embed widget