By: ABP Desam | Updated at : 18 Jul 2023 07:32 AM (IST)
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
Oommen Chandy Death: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం (జూలై 18) కన్నుమూశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. 79 ఏళ్ల చాందీ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
'ప్రేమ' అనే శక్తితో ప్రపంచాన్ని జయించిన రాజు కథ ముగిసిందని కె.సుధాకరన్ ట్వీట్ చేశారు. ఈ రోజు సీనియర్ ఊమెన్ చాందీ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన చాలా మంది వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేశారని, ఆయన వారసత్వం మనస్సాక్షిలో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తుందని అన్నారు.
చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గొంతు సమస్యతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో పుట్టారు. 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి పూతుపల్లి నుంచి విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి అదే నియోజవర్గం నుంచి 12 సార్లు గెలుస్తూ వచ్చారు. 1977లో తొలిసారిగా మంత్రి అయ్యారు. అలా పార్టీ నాయకత్వానికి విధేయత ప్రకటిస్తూ వచ్చారు. అలా ఆయన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిని చేసింది. 2004 నుంచి 2006 వరకు, 2011 నుంచి 2016 వరకు రెండు పర్యాయాలు సీఎం కుర్చీలో కూర్చున్నారు చాందీ.
"Former Kerala CM and senior Congress leader Oommen Chandy passes away", tweets Kerala Congress President K Sudhakaran pic.twitter.com/QAR7EfaUnI
— ANI (@ANI) July 18, 2023
#WATCH | Karnataka | Congress general secretary KC Venugopal arrives at Chinmaya Mission Hospital in Bengaluru where former Kerala CM and senior leader of the party, Oommen Chandy passed away this morning. pic.twitter.com/nfUscdrcNW
— ANI (@ANI) July 18, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Asian Games 2023: చైనా పర్యటన రద్దు చేసుకున్న కేంద్రమంత్రి, అరుణాచల్ ఆటగాళ్లకు వీసా ఇవ్వకపోవడంతో నిర్ణయం
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత అధికారిక ప్రకటన
Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
ఎంపీ రమేశ్ బిదూరిపై హైకమాండ్ ఫైర్, అనుచిత వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు
ముస్లిం ఎంపీని ఉగ్రవాది అన్న బీజేపీ ఎంపీ, సభలో గందరగోళం - వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
/body>