Syed Ali Shah Geelani: హురియత్ నేత సయ్యద్ అలిషా గిలానీ కన్నుమూత.. మెహబూబా ముఫ్తీ సంతాపం..
తుది శ్వాస విడిచే వరకు వేర్పాటు వాదాన్ని బలంగా వినిపించిన హురియత్ కాన్ఫరెన్స్ మాజీ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ మృతి చెందారు.
కశ్మీర్‌లో సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. ఆయన స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నారు.
హురియత్ కాన్ఫరెన్స్ జమ్ముకశ్మీర్ వేర్పువాటు కోసం ఆయన జీవితాంతం పోరాడారు. సయ్యద్ అలీ గిలానీ సొపోరాకు సమీపంలోని ఓ కుగ్రామంలో 1929 సెప్టెంబర్29న జన్మించారు.
ALSO READ: ఫేక్.. తాలిబన్లు ఉరి తీసి హెలికాఫ్టర్‌లో వేలాడతీయలేదు ! అక్కడ అసలు జరిగింది ఇదే..
2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉండేవారు. తర్వాత తెహ్రీక్ ఇ హురియత్ స్థాపించారు ఆల్‌పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. వేర్పాటుకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.
సొపోర్ నియోజకవర్గం నుంచి 1972, 77, 87లో ఎమ్మెల్యేగాను పోటీ చేసి గెలుపొందారు.
ALSO READ:ఇక డ్రోన్లు కంచె దాటొస్తే ఖతం.. 'బీఈఎల్'తో ఇండియన్ నేవీ ఒప్పందం
గిలానీ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ సంతాపం వ్యక్తం చేశారు.
Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers.
— Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021
ALSO READ:'వీపీఎన్'లను బ్యాన్ చేయండి.. కేంద్రానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు
ALSO READ:తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు
ALSO READ: అసంఘటిత కార్మికుల కోసం ఈ-శ్రమ్.. శుభవార్త చెప్పిన కేంద్రం
ALSO READ: తాలిబన్లతో తొలిసారి భారత్ ఉన్నత స్థాయి చర్చలు
ALSO READ: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..