అన్వేషించండి

Kargil Vijay Diwas 2025 :కార్గిల్ విజయ్ దివస్ శత్రువులపై భారత్ వీరోచిత విజయం! వీర సైనికుల త్యాగాల గాథ!

Kargil Vijay Diwas 2025 : పాకిస్తాన్ సైనికుల చొరబాటుతో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. పాక్ 'ఆపరేషన్ బదర్' ద్వారా సైనికులను పంపింది.

Kargil Vijay Diwas 2025 : కార్గిల్ మంచు శిఖరాలపై దాదాపు రెండు నెలల పాటు జరిగిన యుద్ధం తర్వాత, భారత సైన్యం పాకిస్తాన్‌పై విజయం సాధించిన రోజే ఈ రోజు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జులై 26న భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులర్పిస్తుంది. కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, కెప్టెన్ అమోల్ కలియా, లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్ నుంచి గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్,  నాయక్ దిగేంద్ర కుమార్ వరకు దేశం మరచిపోలేని కార్గిల్ 'హీరోలు' చాలా మంది ఉన్నారు.

ఈ యుద్ధం 1999 మే నుంచి జులై వరకు జరిగింది. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న బటాలిక్, కార్గిల్, లేహ్, బాల్టిస్థాన్ మధ్య వ్యూహాత్మక స్థానం ఈ కార్గిల్ యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో బటాలిక్ ప్రధాన యుద్ధ ప్రాంతాలలో ఒకటి. 

శత్రువులతో పోరాడటంతో పాటు, సైనికులు దుర్భరమైన భూభాగాలలో, ఎత్తులో కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' కింద పాకిస్తానీ చొరబాటుదారుల నుంచి కార్గిల్ వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి పొందింది. ఈ యుద్ధం భారత సాయుధ దళాల రాజకీయ దృఢత్వం, సైనిక నైపుణ్యం, దౌత్యపరమైన సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. 

పాకిస్తానీ సైనికుల చొరబాటుతో కార్గిల్ యుద్ధం ప్రారంభం

పాకిస్తాన్ దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. 1990లలో పాకిస్తాన్ ఉగ్రవాదుల సహాయంతో జమ్మూ కాశ్మీర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కొన్ని సంవత్సరాల తరువాత, 1999 కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ కుట్రలలో భాగమైంది. కానీ భారతదేశ సైనిక వీరులు పాకిస్తానీ ఎత్తులను చిత్తు చేశారు. వారినికి మరో పరాజయం మిగిల్చారు. 

పోరాటం పాకిస్తానీ సైనికుల చొరబాటుతో ప్రారంభమైంది, 'ఆపరేషన్ బద్ర్' కింద పాకిస్తాన్ రహస్యంగా కార్గిల్ ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటి తన సైనికులను, ఉగ్రవాదులను పంపింది. భారత సైన్యం 1999 మే మొదటి వారంలోనే చొరబాటును గుర్తించింది. కెప్టెన్ సౌరభ్ కలియాతో సహా 5 మంది భారతీయ సైనికులను పాకిస్తానీ సైన్యం పట్టుకుని దారుణంగా హింసించి చంపింది. ఇది శవపరీక్ష నివేదిక ద్వారా వెల్లడైంది. మే 9న పాకిస్తానీలు భారీ షెల్లింగ్ ప్రారంభించారు. ఇది చొరబాటుదారులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి కవర్ ఫైర్‌గా ఉంది. ద్రాస్, ముష్కోహ్, కాక్సర్ సెక్టార్లలో చొరబాటు జరిగింది.

భారత సైన్యం మే మధ్యలో కాశ్మీర్ లోయ నుంచి తన సైనికులను కార్గిల్ సెక్టార్‌కు తరలించింది. మే చివరిలో భారత వైమానిక దళం ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. రెండు వైపుల నుంచి భీకర పోరాటం కొనసాగింది. జూన్ ప్రారంభంలో, భారత సైన్యం పాకిస్తానీ సైన్యం ప్రమేయాన్ని ధృవీకరించే పత్రాలు విడుదల చేసింది. చొరబాటును కాశ్మీరీ "స్వాతంత్ర్య యోధులు" చేశారనే పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చింది.

శిఖరాలపై ఎగిరిన త్రివర్ణ పతాకం

దృఢ సంకల్పంతో ఉన్న భారత సైన్యం అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని చుట్టుముట్టి వారిని తరిమి కొట్టింది. అనేక స్థావరాలు, చెక్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. సైనికులు పర్వత ప్రాంతాలు, ఎత్తు, తీవ్రమైన చలి వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారు. భీకర పోరాటంలో, జూన్ 13న తోలోలింగ్ శిఖరం భారత సైన్యం వశమైంది. కార్గిల్ యుద్ధంలో ఇది మొదటి గొప్ప విజయం. ఇది యుద్ధానికి మలుపు తిప్పింది. జూలై 4న, భారత సైన్యం 11 గంటల పాటు జరిగిన పోరాటం తర్వాత టైగర్ హిల్ స్వాధీనం చేసుకుంది. మరుసటి రోజు, భారతదేశం ద్రాస్‌ను స్వాధీనం చేసుకుంది. ఇలా అడుగడుగునా గొప్ప విజయాలు సాధించింది. 

ఇక్కడ సైన్యంతోపాటు భారత వైమానిక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తోంది, దీనికి 'ఆపరేషన్ సఫేద్ సాగర్' అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కార్గిల్ మంచు శిఖరాలపై కూర్చున్న శత్రువుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ యుద్ధంలో మరో విజయం జూన్‌ 20న లభించింది, లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ జోషి నేతృత్వంలోని భారత సైన్యం ఈ పాయింట్‌ను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది. 

తరువాత, భారత సైన్యం 'త్రీ పింపుల్స్' ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 'త్రీ పింపుల్స్' ప్రాంతంలో నాల్, బ్లాక్ రాక్ హిల్, త్రీ పింపుల్స్ ఉన్నాయి, వీటిని జూన్ 29న సైన్యం స్వాధీనం చేసుకుంది. జూలై ప్రారంభంలో నిర్ణయాత్మక స్థితికి చేరుకుంటున్న యుద్ధంలో 'టైగర్ హిల్' భారతదేశం వశమైంది. జూలై 4న భారత సైన్యం ఇక్కడ జెండాను ఎగురవేసింది.

పాకిస్తాన్‌ను మోకాలిపై కూర్చోబెట్టింది 
సైన్యం తదుపరి ముఖ్యమైన లక్ష్యం పాయింట్ 4875 ను స్వాధీనం చేసుకోవడం. జూలై 4 నుంచి 7 వరకు పాయింట్ 4875 కోసం యుద్ధం జరిగింది. ఈ ముఖ్యమైన సైనిక చర్యలో భారతదేశం విజయం సాధించింది. పాయింట్ 4875 ను స్వాధీనం చేసుకోవడంతో, భారతదేశం కార్గిల్ ప్రధాన శిఖరాలను జయించింది, ఇక్కడ నుంచి పాకిస్తాన్‌కు ముందుకెళ్లేందుకు వీలు కాలేదు.  

పాకిస్తాన్‌ను మోకాలిపై కూర్చోబెట్టింది. అయితే, భారత సైన్యం ఆగలేదు. ఒక చిన్న పోరాటం తరువాత, సైన్యం పాయింట్ 4700 ను స్వాధీనం చేసుకుంది. దీనితో పాకిస్తాన్ మనోస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. బలవంతంగా జూలై 25న పాకిస్తాన్ వెనక్కి తగ్గవలసి వచ్చింది. జూలై 26న కార్గిల్‌లో ఈ యుద్ధం అధికారికంగా ముగిసింది, ఇందులో భారతదేశం విజయం సాధించింది.

భారతదేశం ఈ యుద్ధంలో తన 527 మంది వీర సైనికులను కోల్పోయింది. 1363 మంది సైనికులు గాయపడ్డారు. వారి జ్ఞాపకార్థం, జూలై 26న భారతదేశం కార్గిల్ విజయాన్ని విజయ్ దివస్‌గా జరుపుకుంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
Hair Fall Remedies : జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Year Ender 2025: 2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
2025 సంవత్సరంలో 161 సార్లు రాశిని మార్చిన చంద్రుడు, డిసెంబర్ 31న చివరి గోచారం!
Hair Fall Remedies : జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
జుట్టు ఎక్కువగా రాలుతోందా? చలికాలంలో ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది
Aadhaar card Update: ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!
EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!
IND Vs SA T20: నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
నేటి రెండో టీ20 మ్యాచ్‌లో గిల్ విజృంభిస్తాడా? సంజూకు అవకాశం ఉంటుందా?
Insomnia Astrology Telugu: రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదంటే జాతకంలో ఎలాంటి దోషం ఉన్నట్టు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు & పరిష్కారాలు!
రెగ్యులర్ గా నిద్రపట్టడం లేదంటే జాతకంలో ఎలాంటి దోషం ఉన్నట్టు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు & పరిష్కారాలు!
Embed widget