అన్వేషించండి

International Yoga Day 2022: గార్డియన్ రింగ్- అంతర్జాతీయ యోగా డే 2022లో ఇదే స్పెషల్

"యోగా ఫర్ హ్యుమానిటీ" అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగాడే 2022 వేడుకను నిర్వహించనున్నారు. ఈ థీమ్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఆ రోజున లక్షల మంది ప్రజలు ఒకచోట చేరి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం వివిధ రకాల యోగాసనాలను వేస్తారు. అభ్యసిస్తారు. భారత్ చొరవ కారణంగానే  అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచానికి పరిచయమైంది. దీనిని 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గుర్తించింది. అప్పటి నుంచి దీన్ని ప్రపంచవ్యాప్త దేశాలు అనుసరిస్తున్నాయి. 

ఎనిమిదో ఏడాది యోగాడే ప్రధాన కార్యక్రమం కర్ణాటకలోని మైసూర్‌లో జరగనుంది. "గార్డియన్ రింగ్" అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొదటిసారిగా సూర్యుని కదలికలను అనుసరిస్తూ ప్రజలు యోగాసనాలు వేయనున్నారు. 

2022 యోగా డే థీమ్‌ ఏంటంటే?

"యోగా ఫర్ హ్యుమానిటీ" అనే థీమ్‌తో ఈసారి వేడుకను నిర్వహించనున్నారు. ఈ థీమ్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇది కోవిడ్-19 పీక్స్‌లో ఉన్నప్పుడు యోగా చాలా ఉపయోగపడిందని... మానవజాతి వృద్ధికి తోడ్పడిందని ఆ శాఖ ఆలోచన అందుకే యోగా ఫర్‌ హ్యుమానిటీ అనే థీమ్‌ను ఎంచుకుంది. శారీరక, ఆధ్యాత్మిక, మానసిక దృఢత్వం కోసం యోగా చికిత్సను అభ్యసించడం ద్వారా పొందగల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి దీన్ని ఎంచుకున్నారు. 

యోగా అంటే "స్వస్థత కలిగిన మనస్సు సుస్థిరమైన శరీరంలో నివసిస్తుంది" అని చెప్తారు. అంటే శరీరం, మనస్సు, ఆత్మ స్వస్థత సాధించడానికి ఒక మార్గం. యోగా అనే పదం సంస్కృత పదం 'యుజ్' నుంచి పుట్టింది. దీని అర్థం 'చేరడం' లేదా 'ఏకము చేయడం'. యోగ గ్రంధాల ప్రకారం యోగ అనేది వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వంతో ఏకం చేసే మార్గం. మనిషి, ప్రకృతి మధ్య సామరస్యాన్ని సాధించడానికి ఇది ఒక మార్గం. 

సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ యోగా దినోత్సవ  సంకల్పాన్ని ప్రతిపాదించారు. అతని ప్రతిపాదనను UNGCలోని రికార్డు స్థాయిలో 177 సభ్య దేశాలు ఆమోదించాయి. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21, 2015న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. భారతదేశంలో ప్రధానమంత్రితోపాటు దాదాపు 36,000 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. దాదాపు 35 నిమిషాలపాటు 21 ఆసనాలను ప్రదర్శించారు.

మంచి మానవులతో ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారు చేయడానికి యోగాను విశ్వవ్యాప్తం చేశారు. ప్రాచీన భారతదేశంలో యోగా అనేది ఐక్యత, మానసిక స్థిరత్వం పెంపొందించడానికి దయ, కరుణ ద్వారా ప్రజలను ఒకచోట చేర్చడానికి ఒక వ్యాయామం. యోగాభ్యాసం ఉద్దేశ్యం మనసు నియంత్రణ, క్రమశిక్షణ, పట్టుదల విలువలను బలోపేతం చేయడం ద్వారా మనుషులు, ప్రకృతి మధ్య సమతుల్య సంబంధాన్ని కొనసాగించడం. 

యోగా ఆవిర్భావం భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం అని నమ్ముతారు. ఇక్కడ ఆది యోగి లేదా శివుడు హిమాలయాలలోని కాంతిసరోవర్ ఒడ్డున ఉన్న సప్తఋషులు అని పిలిచే ఏడుగురు పురాణ ఋషులకు యోగా శాస్త్రాన్ని చెప్పారని ప్రచారంలో ఉంది. ఆయన్నే మొదటి యోగి లేదా ఆది గురువుగా పరిగణిస్తారు. మానవ పరిమితులను అధిగమించడానికి, శాశ్వతమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు యోగ శాస్త్రంలో విలువైన 112 మార్గాలు సూచించారు.  

యోగా నాలుగు రూపాలు 

అజ్ఞానాన్ని తొలగించడానికి, జీవితం లేదా మోక్షం ఉద్దేశ్యాన్ని సాధించడానికి యోగా 4 మార్గాలు వివరించింది. 
అవి 
భక్తి యోగ, 
కర్మ యోగ, 
జ్ఞాన యోగ, 
రాజ్ యోగ 
ఇవి దేనికవే స్వంతంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. కానీ ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి. 

భక్తి యోగ: యోగ సాధనలో భగవంతుని పట్ల భక్తి ఉంటే, దానిని భక్తి యోగం అంటారు. షరతులు లేని ప్రేమ, భక్తి భావాన్ని పెంపొందించడం దీని ఉద్దేశ్యం. 

కర్మ యోగం: కర్మను విశ్వసించడం, తోటి మానవులకు అండగా నిలవడం కర్మ యోగం. ఫలాల కోరిక లేకుండా ధర్మానుసారంగా వ్యవహరించడమే దీని ఉద్దేశం. 

జ్ఞాన యోగ: జీవితంలో నిజమైన లక్ష్యాన్ని కనుగొనడం, దానిని అనుసరించే మార్గాన్ని జ్ఞాన యోగా అంటారు. 

రాజ్ యోగా: ఇది లక్ష్యం, దానిని సాధించే పద్ధతిని సూచిస్తుంది. 19వ శతాబ్దంలో స్వామి వివేకానంద తన రాజయోగ పుస్తకంలో పతంజలి యోగ సూత్రాలను వివరించారు. 

వేద యోగ టైమ్‌లైన్

భారతదేశంలో యోగా అభ్యాసం మహర్షి అగస్టా కాలంలో దాని మూలాలను కనుగొంది. అగస్త్య, సప్తఋషి భారత ఉపఖండం అంతటా ప్రయాణించి, విముక్తి స్థితికి దారితీసే అన్ని రకాల బాధలను అధిగమించడానికి, స్వీయ-సాక్షాత్కారం గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సంస్కృతిని ప్రధాన యోగ జీవన విధానం చుట్టూ రూపొందించారు. అతని తర్వాత యోగ సూత్రాల ద్వారా యోగ ప్రస్తుత అభ్యాసాలను మరింత వ్యవస్థీకరించిన మహర్షి పతంజలి. 

ఇప్పుడు వేద యోగ కాలక్రమాన్ని చూద్దాం. 

500 నుంచి 800 BC మధ్య యోగా: ఇది యోగా అభివృద్ధికి శాస్త్రీయ కాలం. మహావీర్, బుద్ధుని కాలం. మహావీర్ పంచ మహావ్రతం, బుద్ధుని అష్టాంగ మర్గం యోగ సాధన ప్రారంభ రూపాలుగా ప్రవేశపెట్టారు. 

800 AD నుంచి 1700 AD మధ్య యోగా: యోగా ఆచార్యుల త్రయం ఉన్నప్పుడు ఇది యోగా పోస్ట్ క్లాసికల్ కాలం. వాళ్లు ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్యులు ప్రముఖులు. ఈ కాలంలో హఠ యోగ అభ్యాసం నాథ్ యోగులతో వృద్ధి చెందింది. వాళ్లు మత్స్యేంద్రనాథ, గోరక్షనాథ. 

1700 AD నుంచి 1900 AD మధ్య యోగా: దీనిని యోగా ఆధునిక కాలం అంటారు. రాజ్ యోగ అభ్యాసం ఈ కాలంలో రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, స్వామి వివేకానంద మొదలైన యోగా ఆచార్యులు అభివృద్ధి చేశారు.

యోగను ప్రపంచవ్యాప్తంగా ఆధునిక కాలంలో వ్యాప్తించిన వాళ్లు మాత్రం... స్వామి శివానంద్, A,T. కృష్ణమాచార్య, అరబిందో, మహర్షి మహేష్ యోగి, ఆచార్య రజనీష్(ఓషో), BKS. అయ్యంగార్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget