అన్వేషించండి

Cybersecurity Rules: సైబర్ మోసాలకు చెక్! కొత్త సైబర్ సెక్యూరిటీ రూల్స్ విడుదల.. ఏం మారుతుందో తెలుసుకోండి

Cyber Crimes In India | కొత్త సైబర్ భద్రతా నిబంధనలు కొంత మేర మోసాలకు చెక్ పెట్టనున్నాయి. భారతదేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం కొత్త నిబంధనలు అమలు చేసింది.

New Cybersecurity Rules: భారతదేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నిబంధనలు ఎయిర్‌టెల్, జియో, BSNL (బీఎస్ఎన్ఎల్), Vi (Vodafone Idea) వంటి ప్రధాన టెలికాం కంపెనీలకు మాత్రమే కాకుండా.. ఆర్థిక సంబంధిత, బీమా రంగానికి కూడా వర్తిస్తాయి. టెలికాంయేతర కంపెనీలను DoT పరిధిలోకి తీసుకురావడం వినియోగదారుల గోప్యత (Customers Privacy)కు సవాలుగా మారుతుందని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

DoT కొత్త నిబంధనల్లో మార్పు

Economic Times Telecom నివేదిక ప్రకారం.. ఈ కొత్త నిబంధనల లక్ష్యం టెలికాం ఆపరేటర్లను బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలతో అనుసంధానం చేయడం. తమ నియంత్రణ అధికారం లైసెన్స్ పొందిన టెలికాం ఆపరేటర్లకు మాత్రమే పరిమితం చేశామని, ఈ కొత్త నిబంధనలు లైసెన్స్ లేని కంపెనీలను నియంత్రించడానికి ఉద్దేశించినవి కావని DoT స్పష్టం చేసింది.

మొబైల్ నంబర్ ధృవీకరణ వేదిక (MNV) అంటే ఏమిటి?

సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధనలలో ముఖ్యమైన భాగం మొబైల్ నంబర్ వెరిఫికేషన్ (MNV) వేదిక, దీనిని DoT త్వరలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఉద్దేశ్యం ఏమిటంటే, మొబైల్ నంబర్ యజమాని KYC (నో యువర్ కస్టమర్) రికార్డ్‌లలో పేర్కొన్న వ్యక్తి వారేనా, కాదా అని చెక్ చేయడం.

బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, బీమా సంస్థలు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొత్త అకౌంట్స్ తెరిచేటప్పుడు కస్టమర్‌ల మొబైల్ నంబర్‌లను ధృవీకరించగలవు. దీని ద్వారా ఏదైనా బ్యాంక్ ఖాతా లేదా బీమా పాలసీకి లింక్ చేసిన మొబైల్ నంబర్ సరైన వ్యక్తిదేనా అని నిర్ధారించవచ్చు, తద్వారా మోసం, సైబర్ నేరాలను నిరోధించే అవకాశం ఉంది.

సైబర్ మోసాలను ఎలా అడ్డుకుంటుంది?

ఇప్పటివరకు మొబైల్ నంబర్ ఖాతాదారుడిదేనా కాదా అని తనిఖీ చేయడానికి బ్యాంకులకు లేదా సంస్థలకు వీలు కల్పించే చట్టపరమైన వ్యవస్థ భారతదేశంలో లేదని తెలిసిందే. DoT తీసుకొచ్చ్చిన ఈ  కొత్త MNV ప్లాట్‌ఫారమ్ ఈ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఆ రూల్స్ ద్వారా బ్యాంకులు, ఇతర సంస్థలు నేరుగా టెలికాం కంపెనీల నుండి మొబైల్ నంబర్ చెల్లుబాటును నిర్ధారించగలవు. దీనివల్ల మోసపూరిత లావాదేవీలు (Fake Transactions), నకిలీ సిమ్ కార్డులు, నకిలీ ఖాతాలు తెరవడం వంటి సంఘటనలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిబంధనలు ఏ కంపెనీలకు వర్తించవు?

ఈ నిబంధనలు ఈ-కామర్స్ (E Commerce), ఫుడ్ డెలివరీ లేదా ఇతర ఆన్‌లైన్ వ్యాపార వేదికలకు వర్తించవని DoT స్పష్టం చేసింది. వాటి పరిధి నేరుగా టెలికాం నెట్‌వర్క్‌లు, ఆర్థిక సేవలలో ఉన్న సంస్థలకు మాత్రమే పరిమితం అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget