Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి
Coronavirus Cases: దేశంలో రోజువారి కరోనా కేసులు 2వేలకు పైగానే నమోదవుతున్నాయి. కొత్తగా 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus Cases:
దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది వైరస్‌తో మృతి చెందారు. 2,550 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 17,317గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.59%గా ఉంది.
#COVID19 | India reports 2,202 fresh cases, 2,550 recoveries, and 27 deaths in the last 24 hours.
— ANI (@ANI) May 16, 2022
Total active cases are 17,317. Weekly positivity rate is presently at 0.59% pic.twitter.com/HWYntrCyh4
- మొత్తం కరోనా కేసులు: 4,31,23,801
- మొత్తం మరణాలు: 5,24,241
- యాక్టివ్ కేసులు: 17,317
- మొత్తం రికవరీలు: 42582243
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 3 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌లు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్ల 37 లక్షల 34 వేలు దాటింది. ఒక్కరోజే 2 లక్షల 97 వేల 242కి కరోనా టెస్టులు నిర్వహించారు.
కిమ్ రాజ్యంలో
ఇటీవల తొలి కరోనా కేసు నమోదైన ఉత్తర కొరియాలో పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా బారినపడి 8 మంది మృతిచెందారు. ప్రస్తుతం 3 లక్షల 92వేల మంది జ్వరం లక్షణాలతో ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కఠిన చర్యలు చేపట్టాలని అధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులను ఆదేశించారు.
Also Read: Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?