Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?
పండ్లలో ఎన్నో రకాల సుగుణాలు ఉన్నాయి. పండ్లు తినడం చాలా అవసరం.
ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఆహారం పండ్లు. ఎన్నో రకాల పండ్లు ప్రస్తుతం మనం తినే జాబితాలో ఉన్నాయి. కానీ చాలా మంది పండ్లను తినేందుకు ఇష్టత చూపరు. ఆహారంలో వాటికి ముఖ్య స్థానం ఇవ్వరు. నిజానికి మనం తినే ఆహారంలో వాటికే ప్రాధాన్యతనివ్వాలి. ఆహారంలో పండ్లు అధికంగా తినేవాళ్లు యవ్వనంగానే కాదు, అధిక కాలం పాటూ ఆరోగ్యంగా జీవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు దీర్ఘాయుష్షును ప్రసాదించే అద్భుత గుణాలు పండ్లలోనే ఉన్నాయి. కొన్ని పండ్లు ఏడాదంతా దొరుకుతాయి. కొన్ని మాత్రం కొన్ని సీజన్లలోనే లభిస్తాయి. ఆయా సీజన్లకు తగ్గట్టు ఆ పండ్లను కచ్చితంగా తినాల్సిందే. ఒక్కో పండులో ఒక్కో రోగాన్ని రాకుండా అడ్డుకునే శక్తి ఉంది. ఆయా రోగాలు వచ్చాక ఆ పండ్లను తిన్నా కూడా సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ. ఏ పండులో ఏ వ్యాధిని నియంత్రించే గుణం ఉందో తెలుసుకుందాం.
మామిడి పండు
సీజనల్ ఫ్రూట్ ఇది. కేవలం వేసవిలో మాత్రమే దొరుకుతుంది. దీన్ని తింటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య రాదు.
పుచ్చకాయ
ఇది కూడా వేసవి ఫలమే. తింటే దాహమే వేయదు.డీహైడ్రేషన్ సమస్య దరిచేరనీయదు ఈ పండు. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా మంచిది. కొన్ని రకాల చర్మ వ్యాధులను కూడా రాకుండా అడ్డుకుంటుంది.
జామ కాయ
జామ కాయలు ఏ కాలంలోనైనా దొరుకుతాయి. షుగర్ వ్యాధి ఉన్న వారికి జామకాయ చాలా మేలు చేస్తుంది. నోటి దుర్వాసన సమస్యను వెంటనే దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను దరి చేరనివ్వదు.
నేరేడు
వానాకాలంలో దొరికే సీజనల్ పండు నేరేడు. వీటిని తింటే పొట్టలో ఉన్న చాలా సమస్యలు తగ్గముఖం పడతాయి. పిల్లలకు పెడితే ఇంకా మంచిది. నులి పురుగులను చంపేస్తాయి. వీటిని తింటే ఆ సమస్య రాదు.
నారింజ పండ్లు
ఈ పండ్లు శీతాకాలంలో అధికంగా లభిస్తాయి. అప్పట్నించి వేసవిలో కూడా దొరుకుతాయి. నిమోనియా కలగకుండా ఇవి కాపాడతాయి.
నిమ్మకాయ
ఇవి అన్ని కాలాల్లో లభిస్తాయి. రోగినిరోధక శక్తిని పెంచి వైరస్ ల బారిన పడకుండా కాపాడుతాయి. అధికబరువు బారిన పడకుండా చూస్తాయి.
ద్రాక్ష పండ్లు
ఇవి కూడా ఓ రకంగా సీజనల్ పండ్లే. వీటిని తినడం ఆస్టియోపొరోసిస్ వంటి ఆరోగ్యసమస్యలు దరిచేరవు. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బొప్పాయి
చర్మ సమస్యలు రాకుండా కాపాడుతంది బొప్పాయి. పైల్స్ వంటి ఆరోగ్య సమస్య నుంచి కూడా రక్షిస్తుంది. బొప్పాయి అధికంగా తింటే ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.
దానిమ్మ
దానిమ్మలు మార్కెట్లో అన్ని కాలాల్లో లభిస్తాయి. రక్త హీనత సమస్యను అడ్డుకునే సత్తా ఉన్న పండు ఇది. పచ్చకామెర్లు రాకుండా నిరోధిస్తుంది. దానిమ్మ పిల్లలు, పెద్దలూ ఇద్దరూ కచ్చితంగా తినాలి.
Also read: పచ్చిబఠానీ దోశె, చూస్తేనే నోరూరిపోతుంది