Corona Cases India: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి.. కొత్తగా 16 వేలకు పైగా పాజిటివ్ కేసులు
భారత్‌లో కరోనా వైరస్ కేసులు నేడు తగ్గాయి. నిన్న ఒక్కరోజులో 379 మందిని కొవిడ్19 మహమ్మారి బలిగొంది. మరోవైపు క్రియా శీలక కేసులు సైతం క్రమేపీ తగ్గుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. క్రితం రోజుతో పోల్చితే దాదాపు మూడు వేల వరకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 16 వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు క్రియా శీలక కేసులు సైతం క్రమేపీ తగ్గుతున్నాయి. నిన్న ఒక్కరోజులో 16,682 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నిన్న ఒక్కరోజులో 379 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. దేశంలోని మొత్తం కోవిడ్ మరణాలు 4,51,814 కు చేరుకున్నాయి. మొత్తం కరోనా బాధితులలో 3 కోట్ల 33 లక్షల 82 వేల 100 మంది కోలుకున్నారు. భారత్ లో యాక్టివ్ కేసులు 2 లక్షలకు దిగొచ్చాయి. ప్రస్తుతం 2,03,678 మంది కోవిడ్19కు చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్ సైతం భారీగానే జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల కిందటి వరకు కేరళలో భారీగా పాజిటివ్ కేసులు రావడంతో భారత్‌లో మొత్తం కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యేవి. గత వారం నుంచి కేరళలో కరోనా వ్యాప్తి తగ్గింది.
Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన
India reports 16,862 new #COVID cases, 19,391 recoveries and 379 deaths in last 24 hours, as per Union Health Ministry.
— ANI (@ANI) October 15, 2021
Total cases: 3,40,37,592
Active cases: 2,03,678
Total recoveries: 3,33,82,100
Death toll: 4,51,814
Total Vaccination: 97,14,38,553 (30,26,483 in last 24 hrs) pic.twitter.com/HL6ZofzuQl
దేశంలో నిన్న ఒక్కరోజులో 11,80,148 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివిటీ 11 శాతం తగ్గింది. హరియాణాలో కరోనా మరణాల సంఖ్యను సవరించడం తాజా మరణాల సంఖ్యలో కలిపారు. అందువల్ల కొవిడ్ మరణాలలో పెరుగుదల కనిపించింది. గురువారం నాడు దేశ వ్యాప్తంగా 30 లక్షల డోసుల టీకాలు తీసుకున్నారు. భారత్ లో మొత్తం పంపిణీ అయిన డోసులు 97 కోట్లు దాటాయి. రాష్ట్రాల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు.
Also Read: పండుగ నాడు భారీగా పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా