Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్
Corona Cases: దేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతి చెందారు.

Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతి చెందారు. తాజాగా 9,486 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.22 శాతం ఉన్నాయి.
India reports 11,793 fresh COVID19 cases & 27 deaths today; Active caseload at 96,700 pic.twitter.com/mBVgmJr8be
— ANI (@ANI) June 28, 2022
- మొత్తం కరోనా కేసులు: 43,418,839
- మొత్తం మరణాలు: 5,25,047
- యాక్టివ్ కేసులు: 96,700
- మొత్తం రికవరీలు: 4,27,97,092
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 19,21,811 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196 కోట్లకు చేరింది. మరో 4,73,717 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

