Corona Cases Update: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు రెండు లక్షలపైగా కేసులు నమోదు
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. సుమారు ఇరవై ఏడు శాతం కేసులు పెరిగాయి.
రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరిగింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి. రోజు వారి పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఆ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గత ఇరవై నాలుగు గంటల కేసులతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై ఏడు శాతం పెరిగినట్టు. ఇది నిన్నటి కంటే సుమారు యాభై వేలు కేసులు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు పెరిగింది లేదు. 2021 ఏప్రిల్ 27న అంతకు ముందు రోజు కంటే 43,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉండేది ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా యాభై వేలు పెరిగాయి. ఇదే ఆందోళన కలిగించే అంశం.
బుధవారం ఒక్కరోజు 203 మంది చనిపోయారు. అక్టోబర్ 27 తర్వాత చనిపోయిన వారి సంఖ్య పెరగడం కూడా ఇదే ఎక్కువ.
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి