Miss Trans Global 2021: ఈ ఏడాది మిస్ ట్రాన్స్ గ్లోబల్ కిరీటం కూడా మనదే..ఇండియాకు ఇదే తొలిసారి
మిస్ యూనివర్సే కాదు.. మిస్ ట్రాన్స్ కిరీటం కూడా మన దేశానికే వచ్చింది. అది కూడా ఈ ఏడాదే.
ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ యాక్టివిస్టులు.. నిర్వహించే 'మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021' పోటీల్లో విజేతగా నిలిచిన మొదటి భారతీయురాలు శృతి సితార. లండన్‌లో జరగాల్సిన ఈవెంట్ కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయింది. అయితే ఇటీవల ఆన్‌లైన్ ఈవెంట్‌లో ఈ టైటిల్ భారత్ కు దక్కింది.
ఆరు నెలలుగా ఈ పోటీల్లో సితార పోటీ పడుతోంది. కేరళకు చెందిన సితార ప్రభుత్వ ఉద్యోగం పొందిన నలుగురు ట్రాన్స్‌జెండర్లలో ఒకరు. 25 ఏళ్ల ఆమె.. కేరళ ప్రభుత్వంలోని సోషల్ జస్టిస్ విభాగంలో ప్రాజెక్ట్ సహాయకారిణిగా పనిచేస్తోంది.
సితార కిరీటం దక్కించుకోవడంపై కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు కూడా స్పందించారు. 'కేరళకు చెందిన శృతి సితార మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021 గా ఎంపికైంది. పక్షపాతాలు, మన సమాజంలోని సంకుచిత మనస్తత్వంపై సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె సాధించిన టైటిల్ ఇది. కేరళకు గర్వకారణం. శృతికి అభినందనలు." అని ఆర్ బిందు ట్వీట్ చేశారు.
Keralite Sruthy Sithara has been selected as Miss Trans Global 2021, a title she achieved after a long fight against prejudices galore and the narrow mindset of our society. A matter of immense pride for Kerala. Congratulations Sruthy... pic.twitter.com/tJThRAHBJy
— Dr R Bindu (@rbinducpm) December 2, 2021
సితార తాను.. గెలుపొందిన అవార్డును తన తల్లితోపాటుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్ అనన్న చెచికి అంకితం ఇచ్చింది. " ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు వచ్చిన అవార్డును నా అమ్మ మరియు అన్నన్యకు అంకితం చేస్తున్నాను. ఇద్దరూ స్వర్గం నుంచి ఈ క్షణాన్ని చూస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ విజయవంతమైన ప్రయాణం వెనక ఉన్న వారందరికీ చాలా ధన్యవాదాలు. నా గురువుకు చాలా ప్రేమ." అంటూ తన ఇన్ స్టా గ్రామ్ పోస్టులో సితార రాసుకొచ్చింది.
మిస్ ట్రాన్స్.. కిరీటాన్ని.. సితార గెలుచుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ మరియు కెనడా పోటీదారులు ఉన్నారు. పోటీలో ఆమె తనను తాను మోడల్ మరియు నటిగా పరిచయం చేసుకుంది. మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021 కోసం తన ఆడిషన్ టేప్‌లో సితార ఇలా మాట్లాడుకొచ్చింది.. ఈ శీర్షిక నాకు ఆత్మగౌరవం, గర్వం మరియు గౌరవంతో జీవితాన్ని నడిపించడంలో మరియు స్ఫూర్తినిచ్చేలా చేయడంలో నాకు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా సహాయపడుతుంది. మనిషి చేసే ప్రతి పనిని మనం చేయగలమని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను.. అని భావోద్వేగతంలో సితార చెప్పింది.
Also Read: Harnaaz Sandhu: విశ్వ సుందరి హర్నాజ్ ముద్దు పేరేంటో తెలుసా? ఆ పేరు పెట్టింది అతడేనట...
Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల