News
News
X

IF Moon Disappeared: భూమి ఉపగ్రహం చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది ? ఈ మార్పులు ఎప్పుడైనా ఊహించారా

భూమికి సహజ ఉపగ్రహంలా ఉండే చందమామ లేకపోయింటే మన పరిస్థితి ఏంటీ అసలు..? భూమికి చంద్రుడు ఉండటం ఎంతవరకు అవసరం. ఒకవేళ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంతో తెలుసుకోంది.

FOLLOW US: 

IF Earths Moon Disappeared: చంద్రుడు ఓ పెద్ద కొండ. ఇది గ్రహం కాదు... కనీసం సొంతంగా ప్రకాశించనూ లేదు. కానీ సూర్యుడి నుంచి తన మీద పడే కాంతిని రిఫ్లైక్ట్ చేయటంతో చంద్రుడు ఆకాశంలో వెలిగిపోతూ కనిపిస్తాడు. మన భూమికి అతి దగ్గరగా ఉండే అతిపెద్ద సెలెస్టియల్ బాడీ చంద్రుడే.  ఇంత అందంగా కనిపించే చంద్రుడు లేకపోతే మన భూమి పరిస్థితి ఏంటీ.. ఎప్పుడైనా ఆలోచించారా..?

చంద్రుడికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి భూమికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. ఈ భూమి మీద జరుగుతున్న అనేక మార్పులకు కారణం చంద్రుడే. సముద్రంలో కనిపించే అలల దగ్గర నుంచి భూమి మీద బుుతువుల వరకూ అన్నింటికీ కారణం చంద్రుడి గురుత్వాకర్షణ శక్తే.

సముద్రంలో చంద్రుడి వల్ల జరిగే మార్పులు ఏంటో తెలుసా. చంద్రుడికి ఉండే గ్రావిటీ భూమిపై ఉన్న సముద్రం నీటి పైకి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫలితంగా అలలు ఏర్పడతాయి. దానికి గాలి తోడై ఆ సముద్రపు అలలు భారీ స్థాయికి చేరుకుంటాయి.  కొన్ని చోట్ల పెద్ద అలలు, మరికొన్ని చోట్ల చిన్న చిన్న అలలు ఉండి భూమి బ్యాలెన్సింగ్ గా ఉండటానికి  కారణం చంద్రుడే. సముద్రంలో ఆటుపోట్లు అనేవి లేకపోతే సముద్రపు జీవులకు మనుగడే ఉండదు.

చంద్రుడు చేసే మరో మేలు ఏంటంటే మన భూమిని 23.5 డిగ్రీల కోణం ఒంగి  ఉండేలా చేసేది చంద్రుడే. చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా జరిగే ఈ మార్పు వల్లనే భూమిపై బుుతువులు ఏర్పడుతున్నాయి. ఎండ, వాన, చలి అంటూ వేర్వేరు సీజన్లను మనం చూడగలుగుతున్నాం. ఫలితంగా మనిషి భూమిపై బతకగలిగే పరిస్థితులు ఉంటున్నాయి.

భూభ్రమణంపై కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది. చంద్రుడే లేకపోతే భూమి పైన పగటి కాలం ఆరు నుంచి ఎనిమిది గంటలు పెరిగిపోతుంది. ఇన్ని మిలియన్ సంవత్సరాల పాటు అలలతో  ఖండాలను వేరు చేస్తున్న సముద్రాలన్నీ తమ పని మానేయటంతో.. భూమి తిరిగే వేగం సరాసరి మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిపోతుంది. ఫలితంగా భూమిపై మునుపెన్నడూ లేని  విధంగా గంటకు 480 కిలోమీటర్ల వేగంతో  బలమైన గాలులు వీస్తాయి. గాల్లో ఎగిరే పక్షులు భూమి మీద పాకే చిన్న చిన్న జీవులు బతికేందుకు అవకాశం ఉండదు. భూమిలో బలంగా లోతుగా పాతుకుపోయిన చెట్లు.. పొట్టిగా, లావుగా ఉండే ప్రాణులు మాత్రమే ఈ భూమ్మీద బతకగలుగుతాయి. మ్యాగ్జిమం సముద్ర జీవులన్నీ అంతరించే ప్రమాదం ఏర్పడుతుంది. గతంలోలా సముద్రంలో అడుగు భాగాన ఉండే సారవంతమైన న్యూట్రియెంట్స్ ను అలలు సముద్రం పైకి తీసుకురా లేవు.  అలాగే పైనుంచి ఆక్సిజన్ రిచ్ నీటిని సముద్రంలోకి తీసుకెళ్లే అవకాశం ఉండదు.

సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా వచ్చేవే. సూర్యుడు భూమి నుంచి దాదాపు 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నాడు. ఫలితంగా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తితో పోలీస్తే భూమిపై సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం మూడో వంతు మాత్రమే. సూర్యుడి గురుత్వాకర్షణ నేరుగా సముద్రాల మీద ఉంటే ప్రాబ్లం ఏంటంటే రిప్ కరెంట్ జనరేట్ అవుతుంది. ఫలితంగా పెద్ద అలలు అకస్మాత్తుగా రావటం..ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈక్విటోరియల్ వాటర్స్ అన్నీ వేడెక్కుతాయి. అదే సమయంలో ధృవాలన్నీ పూర్తిగా గడ్డ కట్టుకుపోతాయి. ఈ విపరీత పరిస్థితుల కారణంగా ఈ ప్రభావం భూమిపైన పడుతుంది. ఎందుకంటే తీర ప్రాంతాలను ప్రభావితం చేసేది సముద్రంలోని వాతావరణమే. సూర్యుడే కాదు మార్స్ లాంటి మిగిలిన గ్రహాల గురుత్వాకర్షణ కూడా భూమిపై నేరుగా పడుతుంది. ఫలితంగా భూమి ఎటు పడితే అటు వేర్వేరు దశల్లో తిరగాల్సి వస్తుంది. ఫలితంగా బుుతువుల్లో మార్పులు వచ్చేసి భూమిపై బతకగలిగే పరిస్థితులు దెబ్బతింటాయి. భూమిపైన పంటలన్నీ నాశనం అయిపోతాయి. మానవజాతి మరోసారి మంచుయుగంలోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఉత్తర, దక్షిణ ధృవాలు తమ పరిధులను చేరిపేసుకుంటాయి. భూమి పైన ఉన్న సాధారణ నేలలు సైతం ఆక్రమిస్తూ ఒకే దగ్గరికి చేరుకుంటాయి.

పౌర్ణమి చంద్రుడిని చూసి నక్కలు ఊళవేస్తాయనేది మీకు చిరాకు కలిగించే విషయమైనా దాన్నే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే చంద్రుడు లేని మన భూమిని ఊహించుకోలేం. ఈ సారి చంద్రుడిని చూసినప్పుడు మనస్ఫూర్తిగా మామ కాని మామ చందమామకు థాంక్యూ చెప్పండి.

Published at : 15 May 2022 11:48 PM (IST) Tags: Earth Moon Moon Disappeared Earths Satellite Moon News

సంబంధిత కథనాలు

Bilkis Bano :

Bilkis Bano : "బిల్కిస్ బానో" కేసు దోషులందరూ రిలీజ్ - దేశవ్యాప్తంగా విమర్శలు !

Bihar New Cabinet : 16 ఆర్జేడీకి మిగతావి నితీష్ పార్టీకి - బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ !

Bihar New Cabinet :  16 ఆర్జేడీకి మిగతావి నితీష్ పార్టీకి - బీహార్‌లో మంత్రివర్గ విస్తరణ !

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

TROUBLE for Tejashwi Yadav : తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాక్ - ఆ కేసు మళ్లీ తెరపైకి !

TROUBLE for Tejashwi Yadav :   తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాక్ - ఆ కేసు మళ్లీ తెరపైకి !

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

Independence Day 2022: భూమికి 30 కిలోమీటర్ల దూరంలో మురిసిన మువ్వెన్నల జెండా!

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?