News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Agnipath scheme: 'అగ్నిపథ్‌'కు రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు- ఒక్క వాయుసేనలోనే 7.5 లక్షలు!

Agnipath scheme: అగ్నిపథ్ కోసం అప్లికేషన్లు భారీగా వచ్చాయి. ఒక్క వాయుసేనలోనే 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

FOLLOW US: 
Share:

Agnipath scheme: దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్‌' పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో ఖాళీలకు 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 24న ప్రారంభం అయింది. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.

నేవీలో

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై భారత నౌకా దళం కీలక ప్రకటన చేసింది. ఇండియన్ నేవీలోకి తీసుకునే ఫస్ట్ బ్యాచ్ అగ్నివీరుల్లో 20 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేవీకి చెందిన వివిధ ప్రాంతాల్లో వీరిని రిక్రూట్ చేస్తామని పేర్కొంది. 2022లో మొత్తం 3 వేల మంది అగ్నివీరులను తీసుకుంటామని ప్రకటించింది.

10 వేల మంది

నౌకాదళంలో మొదటి బ్యాచ్ అగ్నివీరుల కోసం జులై 1న రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 10 వేల మంది యువతులు ఇందుకోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లను జూన్ 15- జులై 30 వరకు ప్రాసెస్ చేస్తారు.
 
భారత నౌకాదళంలోకి తీసుకునే అగ్నివీరుల నియామకాల్లో ఎలాంటి లింగ భేదం లేదు. పురుషులు, మహిళలు ఇద్దరినీ ఇందులోకి తీసుకుంటాం. భారత నౌకాదళానికి చెందిన వివిధ నౌకల్లో 30 మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే ఇప్పుడు అగ్నివీరుల నియామకాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. వారిని యుద్ధ నౌకల్లో కూడా విధుల కోసం పంపవచ్చు.                                                         "
-దినేశ్ త్రిపాఠీ, వైస్‌ అడ్మిరల్
 
Published at : 06 Jul 2022 05:28 PM (IST) Tags: Agnipath Agnipath Scheme IAF receives nearly 7.5 lakh applications

ఇవి కూడా చూడండి

One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ సాధ్యం అవుతుందా?

One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌ సాధ్యం అవుతుందా?

Chandrayaan 3: ఉలుకు పలుకు లేని చంద్రయాన్ ల్యాండర్, రోవర్ - సన్నగిల్లుతున్న ఇస్రో ఆశలు!

Chandrayaan 3: ఉలుకు పలుకు లేని చంద్రయాన్ ల్యాండర్, రోవర్ - సన్నగిల్లుతున్న ఇస్రో ఆశలు!

Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 27 September 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

టాప్ స్టోరీస్

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు