అన్వేషించండి

దేశం అంతా జాతీయ జెండాలతో నిండిపోవాలి, ప్రధాని మోదీ లక్ష్యం కూడా అదే

Amit Shah Gujarat Visit: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

Amit Shah Gujarat Visit: 

గుజరాత్ పర్యటనలో అమిత్‌ షా 

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్‌లో తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైందన్న అమిత్‌ షా...ప్రస్తుతం దేశ స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన స్థితి ఏమీ లేదని వెల్లడించారు. తమకు దేశం కోసం ప్రాణాలర్పించే అవకాశం రాకపోయినా...దేశం కోసం జీవించే అరుదైన అవకాశం లభించిందని తేల్చి చెప్పారు. మాతృభూమి కోసం బతికే తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ దేశ భక్తి ఉప్పొంగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రధాని మోదీ హర్‌ఘర్ తిరంగాతో అందరిలోనూ స్ఫూర్తి రగిలించారని ప్రశంసించారు. 

"ప్రస్తుతం మనకు దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించే గొప్ప అవకాశం లేకపోవచ్చు. కానీ దేశం కోసం బతికే అద్భుతమైన అవకాశం దొరికింది. ఈ విషయంలో మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. దేశవ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగాలన్న కోరికతో ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని పిలుపునిచ్చారు. చిన్నారుల నుంచి యువత వరకూ అందరిలోనూ దేశంపైన మమకారం పెంచాలన్నదే ఆయన లక్ష్యం. ఇవాళ వేలాది మంది ప్రజలు జాతీయ జెండాను పట్టుకుని నినాదాలు చేస్తుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది"

- అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి 

హర్‌ ఘర్ తిరంగా 

గతేడాది హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి భారీ స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు అమిత్‌ షా. దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేసి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని అన్నారు. మరికొందరు సెల్ఫీలు దిగి మిగతా వాళ్లకూ స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా గుజరాత్‌లోనే కాకుండా దేశమంతా ఇలానే త్రివర్ణ పతాకాలతో నిండిపోవాలని అన్నారు. 

ప్రధాని పిలుపు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. గతేడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశ పౌరులంతా ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని కోరారు. చాలా మంది దీనికి సానుకూలంగా స్పందించారు. ఇంటిపై జెండా ఎగరేశారు. ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సారి కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని అన్నారు ప్రధాని. దేశంతో ప్రతి ఒక్కరూ అనుబంధాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆగస్టు 13-15 వరకూ ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పారు. ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు చేశారు. సోషల్ మీడియా అకౌంట్‌లకు డీపీగా త్రివర్ణ పతాకాన్నే పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 

Also Read: China Engineers: పాక్‌లో చైనా ఇంజనీర్‌ల కాన్వాయ్‌పై దాడి, రెండు గంటల పాటు కాల్పులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget