అన్వేషించండి

Kerala Temples: అది సామాజిక దురాచారం, ఇకనైనా ఆలయాల్లో ఆ పద్ధతిని రద్దు చేయండి - స్వామి సచ్చిదానంద సంచలనం

Temples News in Telugu | ఆలయాల్లో ఇంకా పాత కట్టుబాట్లు, సాంప్రదాయాలు పాటిస్తున్నారని.. అది సామాజిక దురాచారమని శివగిరి పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Abolish Practice Of Male Devotees Removing Upper Attire | తిరువనంతపురం: కొన్ని ఆలయాలలో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే దైవ దర్శనానికి భక్తులను అనుమతించరని తెలిసిందే. తిరుమలలోనూ సాంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి రావాలని నిబంధనలు పెట్టారు. పలు ఆలయాల్లో పురుషులు అయితే పంచె కట్టులో, పైన షర్ట్ లాంటివి లేకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కేరళలోని ప్రముఖ దేవాలయాలలోకి ప్రవేశించే ముందు పురుషులు  పైన ధరించే అంగీ, టీషర్ట్స్ లాంటివి వేసుకోకుండా రావాలనే దీర్ఘకాల ఆచారాన్ని రద్దు చేయాలని స్వామి సచ్చిదానంద పిలుపునిచ్చారు.

శివగిరి మఠాధిపతి సంచలన వ్యాఖ్యలు

సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు స్థాపించిన ప్రఖ్యాత శివగిరి మఠాధిపతి అయిన స్వామి సచ్చిదానంద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేరళలోని వర్కలాలో జరిగిన యాత్రా సదస్సులో ఆయన మాట్లాడుతూ కేరళలోని ఆలయాలలో దర్శనానికి వచ్చే సమయంలో పాటించే ఆచారంపై మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పురుష భక్తులు షర్ట్, టీషర్ట్ లాంటివి ఏవీ ధరించకుండా దర్శనానికి వస్తున్న ఈ ఆచారాన్ని సామాజిక దురాచారంగా అభివర్ణించారు. సాధ్యమైతే దీన్ని రద్దు చేయాలని కోరారు. కేరళ రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు. 

ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే తన భావనను ప్రచారం చేయడానికి శ్రీ నారాయణ గురు  శివగిరి మఠం స్థాపించారు. ఈ మఠం కేరళలోని వెనుకబడిన ఈజావ హిందూ వర్గానికి ప్రధాన పుణ్యక్షేత్రం. నారాయణ గురు ఒక సంఘ సంస్కర్తగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. అట్టడుగు సామాజిక వర్గాల వారు దేవాలయాలలో ప్రవేశించి పూజలు చేసుకునే హక్కులను ఆయన సాధించారు. అయితే కేరళతో పాటు దేశంలోని పలు ఆలయాలలో పురుష భక్తులు పైన వస్త్రాలు లేకుండా దైవ దర్శనం చేసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. అయితే అది ఓ సమాజాక దురాచారం అని, దాన్ని మనం రూపుమాపుదాం అన్నారు. గతంలో పురుషులు "పూనూల్" (బ్రాహ్మణులు ధరించే పవిత్రమైన జంజం) ధరించేలా చూసేందుకు పైన వస్త్రాలను తొలగించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడు అందరికీ చేరువయ్యారని, అందరికీ ఆలయాలలో ప్రవేశం ఉన్నప్పటికీ పాత ఆచారం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకి ప్రయాగ్ రాజ్ లో భారీ ఏర్పాట్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC స్పెషల్ ట్రైన్స్!

స్వామి సచ్చిదానంద విచారం
శ్రీనారాయణ గురు ఈ ఆచారం ప్రబోధాలకు విరుద్ధం. కానీ ఇప్పటికీ కొన్ని ఆలయాలు దాన్ని కొనసాగించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.కొన్ని ఆలయాల్లో అన్య మతస్తులను అనుమతించడం లేదని, కొన్ని శ్రీ నారాయణ ఆలయాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నాయని తెలిసి విచారం వ్యక్తం చేశారు. ఆలయ సంస్కృతిని ఆధునీకరించిన వ్యక్తి శ్రీ నారాయణ గురు అని.. ఆయన మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఉంది. 
స్పందిన సీఎం పినరయి విజయన్
ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరయ్యారు. స్వామి సచ్చిదానంద చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. స్వామీజీ చెప్పింది నిజమని, అలాంటి కట్టుబాట్లకు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Mahakumbh 2025 : రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
రైల్లో కుంభమేళాకు వెళ్తున్నారా - ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌పై ప్రయాగ్‌రాజ్ రైల్వే డివిజన్ కీలక ప్రకటన
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Embed widget