అన్వేషించండి

Supreme Court: హిజాబ్ నిషేధిస్తారా? మరి బొట్టును ఎందుకు బ్యాన్ చేయరా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

Hijab Row: విద్యాసంస్థల్లో హిజాబ్‌ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ఎవరికి ఇష్టం వచ్చిన దుస్తులు వారు వేసుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court:  హిజాబ్ వివాదం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలు హిజాబ్‌పై పలు ఆదేశాలు, తీర్పులు ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఈ హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలో విద్యాసంస్థలు, కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థులు హిజాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించవచ్చని స్పష్టం చేసింది. విద్యార్థులు ఎలాంటి దుస్తులు ధరించాలో విద్యా సంస్థలు ఎలా నిర్ణయిస్తాయని ప్రశ్నించింది. అదే సమయంలో, హిజాబ్‌పై బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది.

ఇలా చేస్తే సాధికారత సాధ్యమా ?
ముంబైలోని ప్రైవేట్ కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధించాలన్న నిర్ణయాన్ని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. కాలేజీ క్యాంపస్ లలో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బాలికల వస్త్రధారణపై ఆంక్షలు విధించడం ద్వారా మహిళా సాధికారత ఎలా సాధ్యం అవుతుందని ముంబైకి చెందిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అమ్మాయిలు ఏం ధరించాలనుకుంటున్నారో వారికే వదిలేయాలని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆడపిల్లల వేషధారణపై ఇలాంటి నిషేధం గురించి మాట్లాడటం విచారకరమని పేర్కొంది. ఈ క్రమంలోనే హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు కోర్టు అనుమతినిచ్చింది.  ఇదే కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.  సదరు కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులు ఏం ధరించాలో సదరు యాజమాన్యాలు నిర్ణయించటం ఏంటని మండిపడింది.  


బొట్టు పెట్టుకోవడం కూడా నిషేధిస్తారా ?
హిజాబ్ నిషేధిస్తే.. అమ్మాయిలు పెట్టుకునే బొట్టును కూడా నిషేధిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ముంబైలోని ఎన్‌జి ఆచార్య, డికె మరాఠే కాలేజీలు హిజాబ్, నిఖాబ్, బుర్ఖా, స్టోల్, క్యాప్ ధరించడాన్ని నిషేధించాయి. దీనికి వ్యతిరేకంగా తొమ్మిది మంది విద్యార్థినిలు గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, మైనారిటీ విద్యార్థినులు డ్రెస్‌ కోడ్‌ ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యను చీఫ్‌ జస్టిస్‌ (సీజేఐ) డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  జైనాబ్ అబ్దుల్ ఖయ్యూమ్ సహా పిటిషనర్ల తరఫు న్యాయవాది అబిహా జైదీ ఈ అంశంపై తక్షణమే విచారణ జరపాలని అభ్యర్థించారు.  కళాశాలలో  ప్రారంభమవుతున్నాయని చెప్పారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని సీజేఐ గురువారం చెప్పారు.


హక్కుల ఉల్లంఘనే..
హిజాబ్, బురఖా, నిఖాబ్‌లను నిషేధించాలనే చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఎన్‌జి ఆచార్య, డికె మరాఠే కాలేజీల నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి బాంబే హైకోర్టు జూన్ 26న నిరాకరించింది. అలాంటి నిబంధనలు పెట్టి విద్యార్థుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవద్దు అని పేర్కొంది. క్రమశిక్షణ పాటించడమే ‘డ్రెస్ కోడ్’ ఉద్దేశమని హైకోర్టు పేర్కొంది.  కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు అందరూ సమానమేనని.. మతాల ప్రదర్శనకు అది వేదిక కాకూడదనే ఉద్దేశంతోనే తాము హిజాబ్‌ని నిషేధించామని.. ముంబైలోని చెంబూరు కాలేజీ తరఫున లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. పేర్లల్లో కూడా మతం ఉంటుందని.. మరి దాన్ని ఎలా తొలగిస్తారని తిరిగి ప్రశ్నించింది. అమ్మాయిలు ఏం ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని.. దేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారనే విషయం సదరు కాలేజీ యాజమాన్యానికి తెలియదా అని నిలదీసింది. ఈ క్రమంలోనే హిజాబ్‌పై తాము ఇచ్చిన ఉత్తర్వులను దుర్వినియోగం చేయకూడదని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబర్ 18 వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget