Haryana Internet Shutdown : ముందు జాగ్రత్తంటే ఇదే - హర్యానా మొత్తం మొబైల్ ఇంటర్నెంట్ బంద్ !
అగ్నిపథ్ ఆందోళన కారణంగా ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధం విధిస్తున్నాయి.
Haryana Internet Stop : సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలంటారు. ఇది హర్యనా ప్రభుత్వానికి కొట్టిన పిండి. దేశం మొత్తం అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా యువత ఉద్యమిస్తోంది. పలు చోట్ల అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లు కనిపిస్తే తగులబెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా తమ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసునులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెల్ నిలిపివేస్తేనే అల్లర్లు ఆగిపోతాయా అనే డౌట్ తెచ్చుకోమాకండి. ఎందుకంటే ఏదో ఒకటి చేయకపోతే ఎలా ..?
Haryana govt orders suspension of mobile internet services, all SMS services in view of potential law and order situation in the wake of new army recruitment policy. Order shall be in force for next 24 hours with immediate effect i.e. till 16:30 hours (tomorrow) pic.twitter.com/eoMsa9HQgx
— ANI (@ANI) June 17, 2022
రైళ్లను పునరుద్ధరిస్తున్నారట, రిజర్వేషన్లు రద్దు చేసుకోవద్దు!
మొబైల్ ఇంటర్నెట్‌పై హర్యానా ప్రభుత్వం విధించిన నిషేధం ఒక రోజు పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఐటీ కంపెనీలు.. ఇతర ఉద్యోగాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. మొబైల్స్‌కు మాత్రమే ఇంటర్నెట్ బంద్ చేస్తున్నామని.. వైర్డ్ ఇంటర్నెట్ ఉంటుందని చెబుతోంది. దీంతో ఐటీ కంపెనీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. హర్యానాలోనూ అక్కడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్నితీవ్ర రూపం దాల్చుతున్నాయి. అందుకే పలు జిల్లాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.
Haryana | We implemented section 144 in the district. The police force has been stationed at every corner. The Police commissioner has issued a strong warning stating that the police will deal strictly with rioters: Faridabad police
— ANI (@ANI) June 16, 2022
అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది
శరవేగంగా ఒకరికొకరు సమాచారం ఇచ్చుకునే వాట్సాప్ వంటి సోషల్ మెసెజింగ్ సర్వీసుల వల్ల ... అల్లర్లు వేగవంతం అవుతున్నాయని అధికారులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఏదైనా అల్లర్లు జరిగితే వెంటనే ఇంటర్నెట్ బంద్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని కోనసీమ జిల్లాలో అల్లర్లు జరిగినప్పుడు కూడా అదే పరిస్థితి. దాదాపుగా పది రోజుల పాటు అక్కడ ఇంటర్నెట్‌ను బంద్ చేశారు. దీనిపై ప్రజల నుంచి నరిసన వ్యక్తమైనా వెనక్కి తగ్గలేదు.
అగ్నిపథ్ సెగలు- బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు