Gujarat Rains: గుజరాత్‌లో దంచికొడుతున్న వానలు, రికార్డు స్థాయి వర్షానికి చెరువుల్లా మారిపోయిన రోడ్లు
Gujarat Rains: ఎడతెరిపిలేని వర్షాలతో గుజరాత్ వాసులు అల్లాడిపోతున్నారు. ఒక్కరోజే రికార్డు స్థాయి వానలు కురిశాయి.
Gujarat Rains: భారీ, అతి భారీ వర్షాలతో గుజరాత్ రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎడతెరిపిలేకుండా దట్టంగా కురుస్తున్న వానలతో గుజరాత్ చిగురుటాకులా వణుకుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో వాన కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గడిచిన కొన్ని గంటల్లోనే ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల నీళ్లు నడుము లోతు వరకు చేరాయి. కార్లను చెరువులో పార్క్ చేసినట్లుగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
గిర్ సోమనాథ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మొదలమైన భారీ వర్షం 14 గంటల పాటు ఏకధాటిగా కురిసింది. 345 మిల్లీ మీటర్ల వర్షం కురిసి రికార్డు నమోదు చేసింది. రాజ్ కోట్ జిల్లాలో కేవలం 2 గంటల వ్యవధిలోనే 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు సూరత్ లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. జునాగఢ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. భారీ నీటి ప్రవాహం కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని 206 జలాశయాల్లో 43 కు హై అలర్ట్ ప్రకటించారు. మరో 18 జలాశాలను అలర్ట్ మోడ్ లో ఉంచారు. 19 రిజర్వాయర్లకు గుజరాత్ సర్కారు హెచ్చరికలు కూడా జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం - NDRF, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు- SRDF సంసిద్ధంగా ఉన్నాయి.
#WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07)
— ANI (@ANI) July 18, 2023
Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R
గుజరాత్‌లో భారీ వర్షాలు
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2023
సౌరాష్ట్ర ధోరజిలో వర్షానికి వాహనాలు నీట మునిగాయి.#GujaratRain pic.twitter.com/1QowPLAHBQ
Video of Veraval Temple and Gangadia Dam#GujaratRain pic.twitter.com/D7HF34bIIg
— Ishani Parikh (@ishaniparikh) July 19, 2023
A crocodile 🐊 was spotted yesterday after heavy rain in Gir Somnath#Gujaratrain #Gujaratwether #girsomanth pic.twitter.com/RHUA7azqFI
— Weatherman Uttam (@Gujarat_weather) July 19, 2023
Heavy rain was seen in some areas of #Surat since morning#Gujaratweather #Gujaratrain pic.twitter.com/aKLAUoAU0O
— Weatherman Uttam (@Gujarat_weather) July 18, 2023
Some scenes of flood situation in Gir Somnath due to extrmaly heavy rain at night#Gujaratrain #saurashth #flood #girsomanth pic.twitter.com/QhxkUL4BDm
— Weatherman Uttam (@Gujarat_weather) July 19, 2023