Gujarat News: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- ఆరుగురు కార్మికులు మృతి
గుజరాత్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.
గుజరాత్ భారుచ్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఏం జరిగింది?
అహ్మదాబాద్ నగరానికి 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున పేలుడు జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో అక్కడ సమీపంలో పనిచేస్తోన్న ఆరుగురు కార్మికులు మరణించారు.
కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అగ్నిమాపక వాహనాలను రప్పించి మంటలను అదుపు చేశా.మని భారుచ్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Six workers killed in blast at chemical factory in Gujarat's Bharuch district: Police
— Press Trust of India (@PTI_News) April 11, 2022
ఇటీవల
మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడలో కూడా రెండు రోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోషి ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. క్రమంగా అవి రసాయన పరిశ్రమ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంగటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 30 ఫైరింజన్లతో కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదు. అయితే రూ.కోట్లలో ఆస్తినష్టం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన కంపెనీ సమీపంలో మరో ఏడు రసాయన పరిశ్రమలు ఉన్నాయని, అదృష్టవశాత్తు వాటికి మంటలు వ్యాపించలేదన్నారు.
Also Read: Watch Video: 'ధూమ్' లెవల్‌లో చేజింగ్- రన్నింగ్ వాహనం నుంచే ఆవులను తోసేసిన దొంగలు, వీడియో చూశారా?
Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి