Viral Video: వైరల్ అవుతున్న అమ్మాయిల గ్యాంగ్ వార్- ఇలాంటి సీన్ సినిమాల్లో కూడా చూసి ఉండరు!
Girls Gang War Video: ట్యూషన్‌కు వెళ్లి వచ్చిన అమ్మాయిలు ఒక చోట చేరి కొట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. చుట్టూ అంత మంది ఉన్నా దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఒక్కరు కూడా చేయలేదు.
Gang War Broke Out Between Girls : మీరు ఇప్పటి వరకు చాలా గ్యాంగ్ వార్స్ చూసి ఉంటారు. రీల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో గ్యాంగ్ వార్‌లు తెలిసే ఉంటుంది. కానీ స్కూల్ చదివే అమ్మాయిలు బైక్స్‌పై వచ్చి గుంపుగా కొట్టుకున్న ఘటన ఎప్పుడైనా చూశారా? అలాంటి గాల్స్ గ్యాంగ్ వార్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రోడ్డుపై కొందరు అమ్మాయిలు పది టూవీలర్స్‌పై వచ్చారు. మరికొందర్ని అబ్బాయిలే తీసుకొచ్చి డ్రాప్ చేశారు. ఇలా వచ్చిన వారిలో ఓ అమ్మాయి... స్కూటర్‌పై ఉన్న అమ్మాయిపై చేయి చేసుకుంది. ఆవేశంతో టూవీలర్ దిగిందో లేదో పరుగు పరుగున అమ్మాయివైపునకు వెళ్లి చెంప పగలగొట్టింది. మెడపట్టి వెనక్కి నట్టేసింది. జుట్టుపట్టి స్కూటర్‌పై నుంచి లాగి పడేసింది.
అలా కొట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లింది. ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కుంది. నేలకేసి ఆవేశంతో విసిరికొట్టింది. కొట్టడమే కాకుండా నోటికి కూడా పని చెప్పింది. ఇదంతా చూస్తున్న వేరే అమ్మాయి అడ్డుకుంది. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దురూ ఒకరినొకరు గట్టిగానే తిట్టుకున్నారు. తర్వాత ఒకరినొకరు నెట్టుకున్నారు.
Kalesh b/w School Girls after Coaching Classes on Road, Caught on CCTV Cam
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 22, 2024
pic.twitter.com/WZKRUbaNOj
అమ్మాయిల మధ్య ఈ వార్ నడుస్తుంటే... వారిని తీసుకొచ్చిన అబ్బాయిలు మాత్రం చూస్తూ ఉండిపోయారు. మరికొందరు అమ్మాయిలు కూడా వారి ఫైట్‌ను వీడియోలు తీస్తున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడి వారంతా ఈ తతంగాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
కాసేపు వేడెక్కిన వాతావరణం కూల్ అయింది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పడిపోయిన ఫోన్ తీసుకున్న బాధితురాలు వేరే వాళ్లకు అప్పగించారు. కొట్టిన అమ్మాయి కూడా అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
ఎందుకు జరిగింది... ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... కొంతమంది అమ్మాయిలు టూవీలర్స్‌పై వచ్చి పొట్టుపొట్టున కొట్టుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అమ్మాయిల గ్యాంగ్ వార్ కేవలం అబ్బాయి కోసమే జరిగి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read: ఒంగోలులో రోడ్డుపై రక్తపు మడుగులో వ్యక్తి- వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి