శాంతి మంత్రంతో G20 సదస్సుని ముగించిన ప్రధాని మోదీ, నవంబర్‌లో వర్చువల్ మీటింగ్
G20 Summit 2023: రెండ్రోజుల G20 సదస్సుని ప్రధాని మోదీ ముగించారు.
G20 Summit 2023:
రెండ్రోజుల సదస్సు ముగింపు..
రెండు రోజుల G20 సదస్సుని ముగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచానికి కొత్త దిశ చూపించడానికి ఇదే సరైన సమయం అని తొలి రోజు సదస్సులో వెల్లడించిన ఆయన ఆ తరవాత పలు కీలక అంశాలపై ప్రపంచాధినేతలతో చర్చించారు. ముఖ్యంగా జియో పొలిటికల్ వివాదాలపై చర్చలు జరిపారు. One Earth,One Family,One Future థీమ్‌తో మూడు సెషన్స్‌లో భేటీలు జరిగాయి. ఈ సదస్సుని ముగిస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌గి గ్యావెల్ అందించారు ప్రధాని. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌లో వర్చువల్ G20 సమావేశాలు జరపనున్నట్టు ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ "శాంతి కోసం ప్రార్థిద్దాం" అని ప్రతిపాదించారు.
"G20 సదస్సు ముగిసింది. One Earth,One Family,One Future థీమ్‌తో జరిగిన ఈ చర్చలు బాగా జరిగాయనే అనుకుంటున్నాను. సభ్యులందరికీ కృతజ్ఞతలు. నవంబర్ వరకూ G20 బాధ్యతలు తీసుకుంటాం. ఈ సదస్సులో జరిగిన చర్చలపై వర్చువల్‌గా రివ్యూ చేయాలని ప్రతిపాదిస్తున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi says, "...As you all know India has the responsibility of G20 presidency till November 2023. In these two days, all of you gave a lot of suggestions and placed proposals. It is our duty that the suggestions we have received be… pic.twitter.com/qvdoCyKnXq
— ANI (@ANI) September 10, 2023
నవంబర్‌లో వర్చువల్ రివ్యూ
గత రెండు రోజుల్లో ప్రపంచ దేశాధినేతలంతా ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారని, మరి కొందరు కీలక ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారని వెల్లడించారు ప్రధాని. ఈ సలహాలను రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని స్పష్టం చేశారు. 2024లో G20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
"రెండు రోజుల ఈ సదస్సులో కీలక నేతలు కొన్ని విలువైన సూచనలు చేశారు. మరి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలూ తీసుకొచ్చారు. వీటన్నింటినీ పున:సమీక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మాపై ఉన్నాయి. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై వర్చువల్‌గా రివ్యూ చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. నవంబర్‌లో ఈ వర్చువల్ భేటీ చేయాలని భారత్ ప్రతిపాదిస్తోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి గురించి ప్రస్తావించారు. ఐరాస స్థాపించినప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయిందని, ఈ మార్పులకు అనుగుణంగా UNలో సంస్కరణలు చేయాల్సిన అవసరముందని సూచించారు.
"ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు ప్రపంచం వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో కేవలం 51 దేశాలకే సభ్యత్వం ఉండేది. ఇప్పుడా సంఖ్య 200కి చేరుకుంది. కానీ శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్యలో మాత్రం మార్పు రాలేదు. అప్పటికి ఇప్పటికి ప్రపంచం చాలా మారిపోయింది. ఇప్పటికి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాల్సిన అవసరముంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: బ్రెజిల్ అధ్యక్షుడికి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని