బ్రెజిల్ అధ్యక్షుడికి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు, గ్యావెల్ అప్పగించిన ప్రధాని
G20 Summit 2023: బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్కి G20 ప్రెసిడెన్సీ బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ.
G20 Summit 2023:
G20 సదస్సు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకోకి గ్యావెల్ అప్పగించారు. వచ్చే ఏడాది బ్రెజిల్లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోదీ. ఇందుకు సంకేతంగా గ్యావెల్ (Gavel) అప్పగించారు. తనకు ఎంతో సన్నిహితుడైన లూయిజ్కి గ్యావెల్ అందిస్తున్నట్టు ప్రకటించారు.
#WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty
— ANI (@ANI) September 10, 2023
దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో స్పందించారు. గాంధీజీకి నివాళులర్పించడం ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని వెల్లడించారు. అహింసా మార్గంలో దశాబ్దాల పాటు ముందుకు నడిచారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అంత గొప్ప వ్యక్తికి ఇలా శ్రద్ధాంజలి ఘటించడం చాలా ఉద్వేగంగా అనిపించిందని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో మహాత్మా గాంధీజీ స్ఫూర్తి తప్పకుండా ఉంటుందని చెప్పారు.
#WATCH | G 20 in India | President of Brazil Luiz Inácio Lula da Silva says, "Personally, I was very much touched and emotional when I went to pay homage to our dear Gandhi today. Everybody knows that in my political life, Mahatma Gandhi has great meaning because the struggle… pic.twitter.com/odS9vR9O2D
— ANI (@ANI) September 10, 2023
G20 2024 అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై బ్రెజిల్ అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు. అంచనాలకు అనుగుణంగానే చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. G20 ని జియో పొలిటికల్ వివాదాలతో విడదీయటం సరికాదని తేల్చి చెప్పారు. కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
"బ్రెజిల్లో జరగనున్న G20 సదస్సులో మేం మూడు అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నాం. ఆకలిపై పోరాటం చేయడం, సుస్థిరాభివృద్ధి సాధించడం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేలా ప్రయత్నించడం. వీటిపైనే దృష్టి సారిస్తాం. G20ని జియోపొలిటికల్ అంశాలతో విడదీయడం సరికాదు. కేవలం డబ్బుల గురించే కాదు. ప్రజల ఆకలి గురించీ పట్టించుకోవాలి. సుస్థిరాభివృద్ధి ప్రమాదంలో పడుతోంది. ఆదాయంలో అసమానతలు ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి"
- లూయిజ్ ఇనాకో, బ్రెజిల్ అధ్యక్షుడు
#WATCH | G 20 in India | President of Brazil Luiz Inácio Lula da Silva says, "Brazilian presidency of the G 20 has three priorities - First, social inclusion and fight against hunger. Second, energy transition and sustainable development in its three aspects...Third, the reform… pic.twitter.com/uvP5zlXOtr
— ANI (@ANI) September 10, 2023Also Read: ఉక్రెయిన్ చేజేతులా దేశాన్ని నాశనం చేసుకుంది, రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు