RailOne App: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ ఒకే యాప్ లో! RailOneతో ఇక చింతే లేదు!
Indian Railways RailOne App: రైల్వేశాఖ తీసుకొచ్చిన ఓ యాప్ టికెట్ బుకింగ్ నుంచి చాలా పనులు పూర్తి చేస్తోంది. ఒకే చోట అనేక సర్వీసులు అందిస్తోంది రైల్వే వన్ యాప్

Indian Railways RailOne App: రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే వరకు అనేక రకాల యాప్‌లతో ఇబ్బందిలేకుండా ఉండేందుకు చాలా సర్వీస్‌లు ఒకే చోట అందించే యాప్ తీసుకొచ్చింది. రైల్వేవన్ పేరుతో వచ్చిన యాప్‌లో టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం వరకు చాలా సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రైల్వేలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ టికెట్ బుకింగ్, శుభ్రమైన ఫుడ్, నీళ్లు ఇలా ప్రతి విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వీటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో సర్వీస్‌కు ఒక్కో యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ రైల్వేవన్ రూపొందించింది.
భారతీయ రైల్వేలో రోజూ 2.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ వేల సంఖ్యలో రైళ్లు నడుపుతోంది. రైల్వే ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పుడు ట్రైన్‌లో ప్రయాణిస్తున్న రైలులో కూర్చుని కూడా ఆహారాన్ని పొందవచ్చు. అది కూడా నచ్చిన ఫుడ్‌ను నచ్చిన చోట నుంచి తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ట్రైన్‌లో ప్రయాణించే ప్రయాణికులు పుడ్ ఆర్డర్ చేయాలంటే వేరే యాప్‌ను యూజ్ చేయాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్‌కు ఓ యాప్, ఫుడ్ ఆర్డర్ చేయడానికి మరో యాప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రెండు పనులతోపాటు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే మరో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ప్రయాణికులు ఇప్పుడు పడుతున్న యాతన గుర్తించిన రైల్వేశాఖ RailOne యాప్ పేరుతో సూపర్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగదారులకు రైల్వేకి సంబంధించిన దాదాపు అన్ని సేవలు చాలా సులభంగా పొందవచ్చు.
రైల్వే RailOne యాప్ ప్రయోజనాలు ఏంటీ
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటే RailOne చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ రైల్వేకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఈ RailOne సూపర్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్‌ను సూపర్ యాప్ అని పిలవడానికి చాలా పెద్దకారణమే ఉంది. ఈ ఒక్క యాప్ ద్వారా చాలా సేవలు పొందవచ్చని భారతీయ రైల్వే శాఖ చెబుతోంది.
ఈ యాప్ ద్వారా ప్రయాణీకుల టిక్కెట్‌లను బుక్ చేసుకోవడమే కాకుండా, రైలు లైవ్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఫుడ్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్ టికెట్ అవసరమైతే ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు కూడా చేయవచ్చు.
ఈ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఈ సూపర్ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. కానీ ఇది త్వరలో గూగుల్ ప్లే స్టోర్, Apple యాప్ స్టోర్‌లోకి అందుబాటులో ఉంది. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, Apple యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీరు మీ ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవచ్చు. లేదా మీరు IRCTC రైల్ కనెక్ట్ యాప్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు.
IRCTC రైల్ కనెక్ట్ యాప్ ఇక పనిచేయదా?
ఈ యాప్ రావడంతో IRCTC రైల్ కనెక్ట్ యాప్ పని చేయడం మానేస్తుందా అని చాలా మందికి అనుమానం ఉంది. అలా జరగదని అంటున్నారు రైల్వేశాఖాధికారులు. వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించడానికే ఈ యాప్ తీసుకువచ్చారు. IRCTC రైల్ కనెక్ట్ యాప్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు ఈ రైల్వేవన్ యాప్ కూడా అలాగే పని చేస్తుంది.





















