women Father : తండ్రి కాదు తల్లి - 30 ఏళ్లు మగ వేషంలోనే 'అన్నాచ్చి' !

సమాజం నుంచి తనను తాను రక్షించుకోవడం.. బిడ్డను పెంచడానికి ఓ మహిళ మగాడి అవతారం ఎత్తింది. ముఫ్పై ఏళ్ల పాటు పెద్దన్నగా బతికింది. కానీ ఇప్పుడు

FOLLOW US: 

భార్యతో విభేదాల కారణంగా కూతుర్ని చూడటానికి బామ్మ వేషంలో అత్తగారింటికే వెళ్తాడు కమల్ హాసన్.. భామనే సత్యభామనే సినిమాలో. అచ్చంగా అలాగే కాకపోయినా ... తన బిడ్డను ఏ లోటు లేకుండా పెంచడం కోసం ముఫ్పై ఏళ్లగా మహిళ నుంచి మగ అవతారంలోకి మారిపోయిందో మహిళ. తల్లి పాత్ర నుంచి తండ్రి పాత్రలోకి వెళ్లిపోయింది. కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆమె తండ్రి కాదు తల్లి అనే విషయం బయట ప్రపంచానికి తెలిసింది. తమిళనాడులో ( Tamilnadu ) ఈ ఘటన జరిగింది.

ఆఫీసుకు రమ్మంటున్నారని రాజీనామా చేసేశారు - ఆ కంపెనీకి ఉద్యోగుల మూకుమ్మడి రిజైన్ !

తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్‌కు  ( Pechiyammal ) పెళ్లి జరిగిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె గర్భవతి. భర్త చనిపోయాక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తనను.. తన కుమార్తెను కాపాడుకోవాలంటే... అసాధారణ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే మగాడి ( Male ) అవతారంలో బిడ్డను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోయింది. అక్కడ తన పేరును ముత్తుగా చెప్పుకుంది. క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి.. ముత్తు ( Muthu ) మాస్టర్​గా అందరి తలలో నాలుకలా మారింది. అందరూ ఆమెను 'అన్నాచ్చి' అంటే పెద్దన్నగా పిలిచేవారు.

ప్రేమ గుడ్డిది కాదు.. చీకటిది ! ఆ బీహార్ ఎలక్ట్రిషియన్ చేసిన పనికి అలా "పెళ్లయింది" !
 
ప్రస్తుతం ముత్తు మాస్టర్​కు   ( Muthu Mastar ) 57 ఏళ్లు. తన కూతురికి వివాహం చేసేసింది. అయితే ఇప్పుడు ఎందుకు బయట పెట్టిందంటే.. ఇటీవల ఆమెకు ఓపిక తగ్గిపోయింది. పని చేసుకోవడం కష్టమవుతోంది. దీంతో  వితంతు, వృద్ధాప్య పింఛను అందితే ఎంతో సహాయకంగా ఉంటుందని తన వివరాలను బయట పెట్టింది.  అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో  ముత్తు అలియాస్ పెద్దన్న ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

నిత్యానంద జబ్బేంటి ? సమాధిలో ఎందుకున్నారు ?

పెచ్చియామ్మాల్​అలియాస్ ముత్తు వివరాలను మీడియాకూడా వెరిఫై చేసింది. నిజమేనని తేల్చింది. ఇప్పుడు ముత్తు అలియాస్ పెచ్చియామ్మాల్​తన ఆధార్ కార్డు మార్చుకుని..  ప్రభుత్వ పథకాలు అందేలా ఎవరైనా సాయం చేస్తారేమో చూస్తోంది. అది ఎంత వరకూ సాధ్యమో కానీ.. సమాజం నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆమె చేసిన సాహసం మాత్రం అందర్నీ అబ్బుర పరుస్తోంది.

త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం, సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా - నేటి రాత్రి కీలక భేటీ

Published at : 14 May 2022 06:43 PM (IST) Tags: Tamil Nadu news Mother not father Annachi mother in father dress

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Anil Baijal Resign: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా- ఇదే రీజన్!

Anil Baijal Resign: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రాజీనామా- ఇదే రీజన్!

Naval Anti-ship Missile: యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం- వీడియో చూశారా?

Naval Anti-ship Missile: యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం- వీడియో చూశారా?

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు

Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్‌ - ఓ రేంజ్‌లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?

KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?

Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!

Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!