Fact Check: శబరిమలలో భక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారా? ఆ చిన్నారి అందుకే ఏడ్చాడా - ఫ్యాక్ట్‌చెక్
Fact Check: కేరళలో శబరిమల భక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత?
Sabarimala Fact Check:
శబరిమలలో భక్తుల రద్దీ..
కేరళలోని శబరిమల ఆలయంలో భక్తులు పోటెత్తుతున్నారు. క్యూల నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల తొక్కిసలాట జరుగుతోంది. ఇది వివాదాస్పదమైంది. రాజకీయంగానూ అలజడి రేపింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రతి వీడియోనీ శబరిమల ఆలయంలోని పరిస్థితులకు లింక్ పెడుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలా ఓ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. అరెస్ట్‌కి గురైన ఓ చిన్నారి బస్‌లోనే నాన్నా..నాన్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో అందరినీ కలిచి వేసింది. శబరిమలకు వస్తున్న భక్తుల పట్ల కేరళ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోందంటూ చాలా మంది ఈ వీడియోని షేర్ చేశారు. హిందువులను ఇలా చూస్తారా అంటూ మండి పడుతున్నారు. కేరళలో హిందువుల పరిస్థితి ఇలా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే వీడియోని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ కూడా షేర్ చేశారు. అయితే...Logically Facts దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఈ వీడియోకి కేరళలో ప్రస్తుత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ వీడియో క్లిప్‌పై (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మలయాళం టీవీ ఛానల్ Asianet News లోగో కనిపించింది.
Image Credits: X
ఇదీ నిజం..
డిసెంబర్ 12వ తేదీన ఈ వీడియో పోస్ట్ అయింది. చిన్నారి అప్పా అప్పా అంటూ గట్టిగా ఏడుస్తున్నాడు. కింద ఉన్న పోలీస్ ఆ చిన్నారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏషియా నెట్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం...నీలక్కల్‌లో భక్తుల రద్దీ ఎక్కువైపోయింది. ఆ రద్దీలో ఓ చిన్నారి తప్పిపోయాడు. నాన్న కోసం వెతుక్కున్నాడు. చాలా సేపు నాన్న కోసం అల్లాడాడని...నాన్న కనిపించిన వెంటనే చేయి ఊపాడని వీడియో పోస్ట్ చేసింది. అయితే...ఇదంతా నిజమేనా అని కేరళ పోలీసులతో ఆరా తీసింది Logically Facts. ఈ ఘటన నీలక్కల్ బేస్ వద్ద జరిగిందని, శబరిమల వెళ్లేందుకు ఆ చిన్నారి బస్ ఎక్కాడని, కానీ ఆ రద్దీలో తన తండ్రి ఎక్కలేదని వివరించారు. ఆ సమయంలోనే భయంతో నాన్నా నాన్నా అని అరిచాడని వివరించారు పోలీసులు. రద్దీని తట్టుకోలేక బస్‌లలో ఎక్కే ప్రయాణికుల సంఖ్యపై ఆంక్షలు విధించారని చెప్పారు. ఆ చిన్నారి ఏడ్చిన కాసేపటికే తండ్రి వచ్చాడని, ఇద్దరూ కలిసి మళ్లీ బస్ ఎక్కారని పోలీసులు వెల్లడించారు. బస్‌పై ఉన్న లోగోనీ గమనించిన ఫ్యాక్ట్ చెక్ టీమ్...అది Kerala State Transport Corporation కి చెందిన బస్ అని తేలింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ విషయం వెల్లడైంది.
(Image Credits: X)
Disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.
Also Read: Pooja Hegde: దుబాయ్ క్లబ్‌లో గొడవ, చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదిరింపులు - ఇందులో నిజమెంత?