Pooja Hegde: దుబాయ్ క్లబ్‌లో గొడవ, చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదిరింపులు - ఇందులో నిజమెంత?
Pooja Hegde Death Threats: ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్‌కు వెళ్లిన పూజా హెగ్డేకు హత్యా బెదిరింపులు ఎదురయ్యాయని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
నటి పూజా హెగ్డే ఇటీవల దుబాయ్‌లోని ఓ క్లబ్ ఓపెనింగ్‌కు వెళ్లిందని, అక్కడ జరిగిన గొడవలో కొందరు ఆమెను చంపేస్తామని బెదిరించారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై పూజా హెగ్డే టీమ్ స్పందించారు. అది ఫేక్ వార్తని, అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
పూజా ఫ్యాన్స్ ఆందోళన..
తాజాగా పూజా హెగ్డేకు హత్యా బెదిరింపులు అనే వార్త సినీ సర్కిల్లో సంచలనం సృష్టించింది. ముందుగా ఒక పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ విషయాన్ని పోస్ట్ చేయగా.. కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం పూజా దుబాయ్ వెళ్లగా.. అక్కడే ఏదో గొడవ జరిగిందని, తను బెదిరింపులకు గురయ్యిందని ఆ పోస్ట్‌లో ఉంది. దీంతో పూజా ఫ్యాన్స్ కలవరపడ్డారు. జాగ్రత్తగా ఇండియాకు తిరిగిరమ్మంటూ ఆ పోస్ట్‌కు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. క్లబ్ ఓపెనింగ్ కోసం పిలిచినప్పుడు తిరిగి జాగ్రత్తగా పంపించే బాధ్యత ఉండదా అంటూ మరో ఫ్యాన్ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి పలువురు పూజా హెగ్డేను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి తన టీమ్ ముందుకొచ్చింది.
నిజం కాదు..
‘‘ఈ వార్తను ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ ఇది అస్సలు నిజం కాదు. అసలు అలాంటి సంఘటన ఏమీ జరగలేదు’’ అంటూ పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ కూడా డిలీట్ అయ్యింది. ఇదంతా ఫేక్ అని తెలియడంతో తన ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ప్రస్తుతం పూజా హెగ్డే అప్‌కమింగ్ సినిమాలపై క్లారిటీ లేదు. అసలు తన చేతిలో ఆఫర్లు ఉన్నాయో లేదో తెలియదు. ఇలాంటి సమయంలో ఈ హత్యా బెదిరింపులు అనే ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడం వల్ల మరోసారి తను లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
అన్ని హిందీ సినిమాలే..
సినిమాల విషయానికొస్తే.. పూజా హెగ్డే చివరిగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమాలో కనిపించింది. విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్‌కంటే ఎక్కువగా నెగిటివ్ రివ్యూలను అందుకుంది ఈ చిత్రం. అయినా కూడా పూజా ఖాతాలో మరికొన్ని హిందీ చిత్రాలు ఉన్నాయి. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవ’ చిత్రంలో షాహిద్ కపూర్‌తో జతకడుతోంది పూజా. సిద్ధార్థ్ రాయ్ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 11న ‘దేవ’ థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. ‘దేవ’తో పాటు పూజా చేతిలో ఉన్న మరో హిందీ చిత్రం ‘హౌజ్‌ఫుల్ 5’. ఈ మూవీలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది పూజా. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.
Also Read: ‘యానిమల్’లో రణబీర్, బాబీ డియోల్ కిస్ సీన్ - థియేటర్‌లో కట్, ఓటీటీలో అన్‌కట్, త్వరలోనే!