అన్వేషించండి

Fact Check: రోడ్డుపై పులి హడలెత్తిస్తున్న వీడియో అనంతపురంలోనా? శ్రీకాకుళంలోనా? అసలు నిజం ఇదిగో

రాత్రి వేళ పులి రోడ్డుపై ఉన్న వీడియో అనంతపురంలో జరిగిందని ప్రచారం జరుగుతోంది. కానీ, అసలు నిజం ఏంటి? ఆ పులి నిజంగా ఏ ఏరియాలో కనిపించింది?

Loepard Viral Video: నడిరోడ్డుపై ఓ చిరుతపుల్లి కూర్చొని ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న బైకర్లు, ఇతర వాహనదారులు ఆ పులిని చూసి భయంతో వెనక్కి వెళ్లిపోతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఫ్లైఓవర్‌ను ఆనుకొని ఉన్న రోడ్డుపై చిరుత పులి దిక్కులు చూస్తూ కూర్చున్న కొన్ని సెకన్ల నిడివిగల ఆ వీడియోను కొంత మంది వ్యక్తులు వాట్సప్‌లలో షేర్ చేసుకుంటూ, ఫేస్‌బుక్, ట్విటర్‌లలో  పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ వీడియోను ప్రచురించాయి.

Claim: రాత్రి వేళ పులి రోడ్డుపై ఉన్న వీడియో అనంతపురంలో జరిగిందని, బుధవారం ఈ ఘటన జరిగిందని ప్రచారం జరుగుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం ఓబులాపురం గ్రామంలో జరిగినట్లుగా కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇంకా కొంత మంది శ్రీకాకుళం జిల్లాలో అడవి నుంచి పులి జనారణ్యంలోకి వచ్చిందంటూ నకిలీ ప్రచారం జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ మీడియా సంస్థ అయితే, ఆ పులి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డుపై కూర్చుందని రాసింది. వైరల్ అయిన ఒకే వీడియోని ఉద్దేశించి ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి.

Fact Check: పులి ఇలా కనిపించడం ఏప్రిల్ 16, 2023న జరిగింది. వీడియోలో కనిపిస్తున్న జాతీయ రహదారి నెంబరు 67. కర్ణాటకలోని గడగ్ జిల్లాలో బింకదకట్టి అనే గ్రామం దగ్గర పులి కూర్చుని ఉంది. బింకదకట్టి అనే గ్రామం బెంగళూరుకు 420 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన ఈ వీడియో కేవలం కొన్ని సెకన్లు మాత్రమే నిలువుగా (వర్టికల్ వీడియో) ఉంది. కొన్ని కన్నడ వార్తా సంస్థలు ఏప్రిల్ 17న ఈ పులి పూర్తి వీడియోను ప్రచురించారు. అందులో ఆ పులి పక్క నుంచే ఓ లోకల్ ఆర్టీసీ బస్సు వెళ్తోంది. ఆ బస్సు నెంబరు రిజిస్ట్రేషన్ పరిశీలించగా, KA 25 అని ఉంది. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లాను సూచిస్తుంది. కాబట్టి, పులి ఉన్న ప్రాంతం గడగ్ జిల్లాగా నిర్ధారించవచ్చు. వైరల్ అవుతున్న వీడియోతో రివర్స్ సెర్చ్ చేయగా, ఒరిజినల్ వీడియో కనిపించింది.Fact Check: రోడ్డుపై పులి హడలెత్తిస్తున్న వీడియో అనంతపురంలోనా? శ్రీకాకుళంలోనా? అసలు నిజం ఇదిగో

చాలా సేపు అక్కడే ఉన్న చిరుతపులి
చిరుతపులిని చూసి దూరంగా ఆగిపోయిన వాహనదారులు తమ మొబైల్ కెమెరాల్లో వీడియోలు తీశారు. అందులో కొంతమంది ద్విచక్రవాహనదారులు పులిని చూసి జడుసుకొని వెనక్కి వెళ్తుంతుండడం స్పష్టంగా కనిపిస్తుండడం వల్ల ఆ వీడియో సాధారణంగానే అందరికీ ఆసక్తిని కలిగించింది. దానికితోడు నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న తీరు, అది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందనే ప్రచారం జోడించేసరికి విపరీతంగా వాట్సప్ ఫార్వర్డ్‌లు సాగుతున్నాయి. కానీ, అసలు నిజం ఏంటంటే అది కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన ఘటన. ఆ మరుసటి రోజే కర్ణాటకకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ఆ వీడియోని ప్రచురించాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనంతపురం, శ్రీకాకుళంలో జరిగిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget