అన్వేషించండి

Rashmi Shukla: మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పరిణామం- డీజీపీ రష్మీ శుక్లాను తప్పించిన ఈసీ 

Maharashtra Elections News: మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శుక్లాపై బదిలీవేటు వేసింది ఎన్నికల సంఘం. ఆమెను తప్పించాలని మహావికాస్‌ అఘాడీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. 

Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర డీజీపీగా రష్మీ శుక్లాను ఎన్నికల సంఘం తప్పించింది. రష్మీ శుక్లాను బదిలీ చేయాలని కాంగ్రెస్ సహా మహావికాస్ అఘాడి నేతలు ఆమెపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశారు. నిరంతరం ఆమె పని తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి డిమాండ్ ఫలించింది.

అన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం శుక్లాను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు (నవంబర్ 5) మధ్యాహ్నం 1 గంటలోపు ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల పేర్లు పంపించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించింది. అంతకంటే ముందు ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఎంపిక చేయనున్నారు.

రష్మీ శుక్లాపై పలు ఆరోపణలు 
రష్మీ శుక్లా సర్వీస్ జూన్ 2024తో ముగిసినప్పటికీ, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జనవరి 2026 వరకు ఆమె పదవీకాలం పొడిగించారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. రష్మీ శుక్లా పని తీరు చాలా వివాదాస్పదంగా ఉందని, ఆమె చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేశారని, ప్రతిపక్షాల నాయకులను బెదిరించారని నానా పటోలే ఆరోపించారు.

ఎన్నికల సంఘం నుంచి బదిలీ ఉత్తర్వులు 
నానా పటోలే, కాంగ్రెస్ అభ్యంతరం తర్వాత ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగానే రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

సీనియర్ అధికారికి బాధ్యతలు
మహావికాస్ అఘాడి అభ్యంతరాలతో రష్మీ శుక్లాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం తక్షణమే ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. రష్మీ శుక్లాను బదిలీ చేసిన తర్వాత అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవిని అప్పగించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

రష్మీ శుక్లా ఎవరు? 
రష్మీ శుక్లా 1988 బ్యాచ్ IPS అధికారి. మహారాష్ట్ర పోలీస్‌లో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఆమె ఒకరు. అంతకుముందు ఆమె సశాస్త్ర సీమా బల్ (SSB) సెంటర్ చీఫ్‌గా పనిచేశారు. పూణే పోలీస్ కమిషనర్‌గా కూడా ఉన్నారు. శుక్లా బదిలీ తర్వాత ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బాధ్యత ఎవరికి ఇస్తారనే సస్పెన్స్‌ కూడా సాగుతోంది. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో పేరు  
మహారాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో రష్మీ శుక్లా పేరు వెలుగులోకి వచ్చింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో రష్మీ శుక్లాపై ఆరోపణలు వచ్చాయి. ఆమె విచారణ కూడా ఎదుర్కొన్నారు. మంత్రులు, నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్న టైంలో శుక్లా సంజయ్ రౌత్, నానా పటోలే సహా మహావికాస్ అఘాడీకి చెందిన ముఖ్యమైన నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేత విజయ్‌ వాడెట్టివార్‌ స్వాగతించారు. "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మహాకూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తేలింది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారిణి రష్మీ శుక్లా పదవీకాలాన్ని పొడిగించాలని మహాకూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఏమిటి? మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరగకుండా చూసేందుకు ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా వచ్చిన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అధికారులను పదవుల్లో కూర్చోబెట్టిందనే విషయం తేలిపోయింది. ఈ సమయంలో మహాకూటమి ప్రభుత్వం తమకు నచ్చిన అధికారులకు పొడిగింపు ఇచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వడ్డెట్టివార్ సంచలన ఆరోపణ చేశారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో బస్‌ పడి 28 మంది మృతి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget