LJP Symbol Row: ఎల్‌జేపీ నేతల మధ్య వర్గపోరు.. పార్టీ నేతలకు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
చిరాగ్ పాశ్వాన్ వెంట ఉన్న ఎల్‌జేపీ వర్గం గుర్తు తమదేనని చెబుతుంటే, పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీ నేతలు తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎల్‌జేపీ గుర్తును స్తంభింపచేస్తూ ఎన్నికల కమిషన్ శనివారం నాడు నిర్ణయం తీసుకుంది. పార్టీలో వర్గపోరు కారణంగా ఈసీ తాత్కాలికంగా పార్టీ గుర్తును నిలిపివేసింది. ఇదివరకే చిరాగ్ పాశ్వాన్ వెంట ఉన్న ఎల్‌జేపీ వర్గం గుర్తు తమదేనని చెబుతుంటే, పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీ నేతలు తమకు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పార్టీలో వర్గపోరు నేపథ్యంలో ఈసీ ఎల్‌జేపీ గుర్తును స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకుంది. అధికారికంగా నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.
పార్టీ నేతల మధ్య వర్గపోరు..
పార్టీ గుర్తు అయిన ఇల్లు తమకే సొంతం కావాలని చిరాగ్ పాశ్వాన్ వాదిస్తోంది. మరోవైపు పశుపతి సారథ్యంలోని నేతలు గుర్తు తమకు ఇవ్వాలని ఈసీకి విన్నించుకున్నారు. అక్టోబర్ 4వ తేదీలోపు.. వీలైతే శనివారం నాటికి ఈసీ తమ నిర్ణయాన్ని తీసుకుంటాయని చెప్పారు. ఎల్‌జేపీ గుర్తును స్తంభించపచేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బిహార్‌లో 2 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్‌జేపీ వర్గపోరు ఈసీ వరకు వెళ్లింది.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
చిరాగ్ పాశ్వాన్, పశుపతి వర్గాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో వీరు ఈసీని ఆశ్రయించారు. కానీ ఇటు చిరాగ్ వర్గానికి గానీ. అటు పశుపతి వర్గానికి గానీ ఎల్‌జేపీ గుర్తును కేటాయించకూడదని ఈసీ నిర్ణయించింది. సోమవారం నాడు దీనిపై ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈసీ నిర్ణయంపై ఇరు వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి. అయితే ఎల్‌జేపీ గుర్తు తమదేనని చిరాగ్ పాశ్వాన్ మరోసారి స్పష్టం చేశారు. పవుపతి వర్గం నేతలు సైతం తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దిగుతారని.. ఎల్‌జేపీ గుర్తు తమకు దక్కుతుందని ధీమాగా ఉన్నారు.
Also Read: దేశంలో తగ్గుతోన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 197 రోజుల తర్వాత ఇదే కనిష్టం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి