By: ABP Desam | Published : 06 Jan 2022 06:08 AM (IST)|Updated : 06 Jan 2022 06:08 AM (IST)
11సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న బిహార్ వ్యక్తి
బిహార్‌లోని ఓ వృద్దుడు ఏకంగా 11సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్ ఉపయోగించి ఇలా వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
బిహార్‌లోని మాధేపురా జిల్లాలోని ఒరై గ్రామానికి చెందిన 84 ఏళ్ల వ్యక్తి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను 11సార్లు తీసుకున్నాడు. 12వ డోస్ తీసుకునేందుకు వెళ్లి పట్టుబడ్డాడు.
బ్రహ్మదేవ్ మండల్ అనే వ్యక్తి ఏకంగా 11 సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యాక్సిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందుకే పలుమార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పాడా వ్యక్తి.
"నేను వ్యాక్సిన్‌తో చాలా ప్రయోజనం పొందాను. అందుకే పదే పదే తీసుకుంటున్నాను" అని చెప్పాడు మండల్.
రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి అయిన మండల్, గత ఏడాది ఫిబ్రవరిలో తన మొదటి కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి మార్చి, మే, జూన్, జూలై, ఆగస్టు వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
అలా డిసెంబర్ 30 నాటికి ఒకే పబ్లిక్ హెల్త్ సెంటర్‌లో 11 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఆ వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌ను వినియోగించి ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మిగిలిన మూడు సందర్భాల్లో తన ఓటర్ ఐడి కార్డ్, అతని భార్య ఫోన్ నంబర్‌ను ఉపయోగించాడని అధికార్లు తేల్చారు.
😳
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 5, 2022
84-year-old Bihar man gets 11 shots of Covid vaccine, caught while going for 12th https://t.co/CbKRd3H8dy pic.twitter.com/Nbac0fwjox
అధికారులను తప్పించి ఇన్ని సార్లు వ్యాక్సిన్‌లు ఎలా తీసుకున్నాడనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Also Read: Covid-19 Update: ఒక్కరోజే 58 వేల కరోనా కేసులు.. దేశంలో వైరస్ 'మహా' కల్లోలం
Also Read: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయించారా? ఇవి అక్కర్లేదు.. గుర్తుపెట్టుకోండి
Also Read: PM Narendra Modi: పంజాబ్‌లో ప్రధాని మోదీకి నిరసన సెగ.. ర్యాలీ రద్దు చేసి హుటాహుటిన దిల్లీకి పయనం!
Mysterious metal balls raining : గుజరాత్లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !
Salary In Gold : ఆ కంపెనీలో జీతం క్యాష్ కాదు గోల్డ్ - వాళ్ల జీతం బంగారమైపోయింది !
Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ
One Block Board Two Classes : ఒక్క క్లాస్ రూమ్‌లో ఒకే సారి రెండు తరగతులకు పాఠాలు చెప్పడం చూశారా ? బీహార్ నుంచి చూపిస్తున్నాం చూడండి
Delhi Buldozer politics : ఢిల్లీలో 80 శాతం అక్రమ నిర్మాణాలే, కూల్చేస్తారా? - బీజేపీని ప్రశ్నించిన కేజ్రీవాల్ !
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న