ED Summons Sanjay Raut: సంజయ్ రౌత్‌కు మరో షాక్- ఆ కేసులో మరోసారి ఈడీ సమన్లు
ED Summons Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
ED Summons Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పత్రచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌కు ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.
అయితే ఈ కేసులో మంగళవారం విచారణ అధికారుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. సంజయ్ రౌత్ హాజరుకాక పోవడంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
Enforcement Directorate (ED) sends a second summon to Shiv Sena leader Sanjay Raut, asking him to appear before them on 1st July in connection with the Patra Chawl land scam case.
— ANI (@ANI) June 28, 2022
(File photo) pic.twitter.com/oMCnaeRRRE
సమయం కావాలి
అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని సంజయ్ రౌత్ కోరారు. దీంతో జులై 1న తమ ముందు హాజరు కావాలని సంజయ్ రౌత్‌కు ఈడీ తెలిపింది. వచ్చేటప్పుడు ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను తీసుకురావాలని సమన్లలో ఈడీ పేర్కొన్నట్లు సమాచారం.
Sanjay Raut has been asked by ED to bring some important documents related to the matter. He has been summoned on July 1st in connection with the Patra Chawl land scam case.
— ANI (@ANI) June 28, 2022
మహారాష్ట్ర సంక్షోభంపై సంజయ్ గట్టిగా ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే కేసు
2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్‌కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్ రౌత్.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా కలిసి ఆలీబాగ్‌లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్‌పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ నేపథ్యంలో రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది.
Also Read: Maharashtra Political Crisis: 'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!