(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Political Crisis: 'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!
Maharashtra Political Crisis: 50 మంది ఎమ్మెల్యేలతో త్వరలోనే ముంబయి వస్తానని శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయి వస్తున్నట్లు శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.
Maha political crisis: Eknath Shinde claims support of 50 Shiv Sena MLAs, says will return to Mumbai shortly
— ANI Digital (@ani_digital) June 28, 2022
Read @ANI Story: https://t.co/p8U1oPAXql#Eknath_Shinde #Shivsena #MaharashtraPolitcalCrisis pic.twitter.com/HgOu3bEdFZ
దిల్లీకి ఫడణవీస్
మరోవైపు మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలు, భాజపా కార్యాచరణ గురించి చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫడణవీస్ భేటీ కానున్నారు. ఇప్పటికే ఫడణవీస్ నివాసంలో రాష్ట్ర భాజపా కోర్ కమిటీ భేటీ అయింది. అనంతరం ఆయన భాజపా అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు దిల్లీ వెళ్లారు.
వారికి మంత్రి పదవులు
మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన షిండే వర్గానికి కీలక పదవులు ఇవ్వాలని కాషాయ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భాజపా, శివసేన తిరుగుబాటు నేత షిండే వర్గం మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై అగ్రనేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవడానికే ఫడణవీస్ దిల్లీ వెళ్లారని సమాచారం.
Also Read: G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు