Satyapal Malik On Agnipath Scheme: 'అగ్నివీరులకు పెళ్లి ఎలా అవుతుంది, పిల్లను ఎవరిస్తారు?- కాస్త చెప్పండి మోదీజీ'
Satyapal Malik On Agnipath Scheme: అగ్నిపథ్ పథకంపై ప్రధాని మోదీ పునరాలోచించాలని మేఘాలయ గవర్నర్ కోరారు.
Satyapal Malik On Agnipath Scheme: అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ పథకంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులకు పిల్లను ఎవరిస్తారంటూ ప్రశ్నించారు.
Meghalaya governor Satyapal Malik on Agnipath scheme: This is a wrong scheme and will dent the reputation of the Armed forces. Jawaan should be recruited through the old scheme. pic.twitter.com/JdJaM0HQKS
— Piyush Rai (@Benarasiyaa) June 26, 2022
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఒక గవర్నర్ ముందుకు రావడం ఇదే తొలిసారి. మోదీ సర్కార్ తెచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. భాజపా మిత్రపక్షంగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా గళం విప్పింది.
విశేష స్పందన
మరోవైపు అగ్నిపథ్ నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. అప్పటిలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, బంగాల్, హరియాణా ఇలా చాలా రాష్ట్రాల్లో హింసాత్మకంగా ఆందోళనలు జరిగాయి. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకొని పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
Also Read: G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు
Also Read: Heat Wave In Tokyo: జపాన్‌లో భానుడి బ్యాటింగ్- 150 ఏళ్ల రికార్డ్ బద్దలు!