Drone Show: ఈ డ్రోన్ షో జిగేల్, జిగేల్! చూస్తే చూపు తిప్పుకోరు - ప్రధాని మోదీ ట్వీట్
36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి ముందు అహ్మదాబాద్‌లో తొలి డ్రోన్ షో నిర్వహించారు. సబర్మతి నదీ తీరంలోని అటల్ వంతెన చివరన జరిగిన డ్రోన్ షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌లో బుధవారం సాయంత్రం (సెప్టెంబరు 28) జరిగిన డ్రోన్ షో ఆకట్టుకుంది. జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి ముందు ప్రజల ఉత్సాహాన్ని పెంచేందుకు ఈరోజు డ్రోన్ షోని నిర్వహించారు. ఇందులో భాగంగా ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు ఏరియల్ డ్రోన్ షో చేశారు, అంటే మన దేశంలోనే తయారు చేసిన సుమారు 600 స్వదేశీ డ్రోన్‌లు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, వెల్‌కమ్ పీఎం మోడీ, మ్యాప్ ఆఫ్ ఇండియా, వందే గుజరాత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, నేషనల్ గేమ్స్ లోగో డ్రోన్‌ల ద్వారా ఆకాశంలో కనిపించాయి.
భిన్న థీమ్‌లు, డిజైన్‌లతో కూడిన డ్రోన్ ప్రదర్శన
36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవానికి ముందు అహ్మదాబాద్‌లో తొలి డ్రోన్ షో నిర్వహించారు. సబర్మతి నదీ తీరంలోని అటల్ వంతెన చివరన జరిగిన డ్రోన్ షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. డ్రోన్ షోను క్రీడలు, హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ప్రారంభించారు. 600 మేక్ ఇన్ ఇండియా డ్రోన్‌లు ఆకాశంలో వివిధ థీమ్‌లతో డిజైన్‌లను ప్రదర్శించాయి. ఈ డ్రోన్‌లను ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు డ్రోన్ షో కోసం తయారు చేశారు.
మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం
గురువారం (సెప్టెంబరు 29) సాయంత్రం మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు, అహ్మదాబాద్ నగరాన్ని అలంకరించారు. జాతీయ క్రీడల ప్రతిరూపాలను ప్రతిచోటా ఉంచారు. ప్రజల్లో ఉత్సాహం పెంచేందుకు క్రీడాశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా అందులో భాగంగానే ఈరోజు అహ్మదాబాద్‌లో డ్రోన్ షో నిర్వహించారు. సాయంత్రం జరిగిన డ్రోన్ షోను చూసేందుకు సబర్మతి రివర్ ఫ్రంట్‌లో జనం పోటెత్తారు.
"असरदार, सरदार"
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2022
Witness the iconic statue of unity (@souindia) during the #DroneShow.#NationalGames2022 pic.twitter.com/xaoIyhFRwH