కర్ణాటకలో పంట పొలాల్లో కుప్ప కూలిపోయిన తపస్ డ్రోన్, ట్రయల్స్ చేస్తుండగా ప్రమాదం
Tapas Crashes: డీఆర్డీవో తయారు చేసిన తపస్ డ్రోన్ కర్ణాటకలో పంట పొలాల్లో కుప్ప కూలింది.
Tapas Crashes:
చిత్రదుర్గలో క్రాష్..
డీఆర్డీవో తయారు చేసిన తపస్ (Tapas) అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ (UAV)డ్రోన్ కర్ణాటకలోని చిత్రదుర్గలో పంట పొలాల్లో క్రాష్ అయింది. ట్రయల్స్ నిర్వహిస్తూ ఉండగా..ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే రక్షణ శాఖ దీనిపై ఆరా తీసింది. క్రాష్ అవ్వడానికి కారణాలేంటో త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కుప్ప కూలిన కాసేపటికే గ్రామస్థులందరూ ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పంట పొలాల్లో కూలిపోయిన ఈ యూఏవీ...చెల్లాచెదురైంది. ఎక్విప్మెంట్ అంతా ధ్వంసమైంది. ఈ తపస్ ఏరియల్ వెహికిల్స్‌ని గతంలో రుస్తుం-2 గా పిలుచుకునే వారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతన్నాయి. పలు సందర్భాల్లో చాపర్లు కూడా ఇలాగే పంట పొలాల్లో కూలిపోయాయి. కర్ణాటకలోనే ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో పైలట్లు గాయపడ్డారు.
#WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw
— ANI (@ANI) August 20, 2023
జూన్ 1న కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్ప కూలింది. కూలగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, సురక్షితంగా ఉన్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరుకు 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామ్‌రాజ్‌నగర్‌లో రొటీన్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి పంట పొలాల్లో కూలిపోయింది. ఈ క్రాష్‌కి కారణమేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు.
"కిరణ్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ మకాలి గ్రామంలోని చామ్రాజ్నగర్ వద్ద పంటపొలాల్లో కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరిలో ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమేంటో విచారణ జరపుతాం
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్
VIDEO | Visuals from the site in Karnataka's Chamarajanagar where an IAF trainer aircraft crashed earlier today. pic.twitter.com/ozXQGGQQ0D
— Press Trust of India (@PTI_News) June 1, 2023ఆర్మీ హెలికాప్టర్లు, చాపర్లు కూలిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. గతంలో జమ్ముకశ్మీర్‌లో ఓ చాపర్ కూలిపోయి ఓ పైలట్ మృతి చెందాడు. ఇటీవల మరోసారి ఇలాంటి దుర్ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని హనుమాన్మార్గ్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలింది. సూరత్గర్ నుంచి టేకాఫ్ అయిన చాపర్...కాసేపటికే కూలిపోయింది. పారాచూట్ సాయంతో పైలట్ సహా కో పైలట్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే...ఆ చాపర్ ఓ ఇంటిపై కూలడం వల్ల ఆ ఇంట్లోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read: Watch Video: రెస్టారెంట్లో ఉన్నట్టుండి కాల్పులు, ఓ రిటైర్డ్ టీచర్ మృతి