News
News
X

వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణీ పరీక్షలు విజయవంతం- ఆనందం వ్యక్తం చేసిన డీఆర్‌డీవో

మల్టీలేయర్‌ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో, శత్రు యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు గుర్తించేందుకు సైనికుడి చివరి రక్షణ శ్రేణి VSHORAD.

FOLLOW US: 
 
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మంగళవారం ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో గ్రౌండ్ ఆధారిత పోర్టబుల్ లాంచర్ నుంచి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) క్షిపణిని పరీక్షించింది. రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.

DRDO ప్రకారం, VSHORADS అనేది దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (MANPAD). దీనిని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్‌తోపాటు DRDOలోని ఇతర ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాముల సహకారంతో రూపొందించింది.

VSHORADS అనేక నావెల్‌ సాంకేతికత కలిగి ఉంది. వీటిలో సూక్ష్మీకరించిన రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ విజయవంతంగా పరీక్షించినట్టు ANI పేర్కొంది. 

డబుల్‌ థ్రస్ట్ సాలిడ్ మోటార్‌ క్షిపణిని నడిపిస్తుంది, ఇది తక్కువ శ్రేణుల వద్ద తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ప్రమాదాలను  ఎదుర్కొంటుంది. 

News Reels

క్షిపణి రూపకల్పన, లాంచర్‌తో సహా, పోర్టబిలిటీ కోసం చాలా ఆప్టిమైజ్ చేశారు. రెండు విమాన పరీక్షలు మిషన్ లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చాయి.

మల్టీలేయర్‌ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో, శత్రు యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు గుర్తించేందుకు సైనికుడి చివరి రక్షణ శ్రేణి VSHORAD.

ఈ షార్ట్‌ రేంజ్‌ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ప్రధాన నగరం లేదా ఏదైనా వ్యూహాత్మక ప్రదేశ రక్షణ కోసం చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఎయిర్ డిఫెన్స్ గన్స్ L-70, ZU-23 వంటివి భారత సైన్యం వద్ద ప్రస్తుతం ఉన్నా అవి నాలుగు దశాబ్దాల నాటివి. అందువల్ల అవి పూర్తిగా వాడుకలో లేవు.

Published at : 27 Sep 2022 07:07 PM (IST) Tags: DRDO Odisha VSHORADS Missile Air Defence System missile

సంబంధిత కథనాలు

Youtube Ads: యూట్యూబ్‌లో ఆ యాడ్స్ వల్ల ఫెయిల్ - రూ.75 లక్షల దావా వేసిన యువకుడికి సుప్రీంకోర్టు షాక్

Youtube Ads: యూట్యూబ్‌లో ఆ యాడ్స్ వల్ల ఫెయిల్ - రూ.75 లక్షల దావా వేసిన యువకుడికి సుప్రీంకోర్టు షాక్

Resort Politics : 40 రోజుల పాటు రిసార్ట్ పాలిటిక్స్ - ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు.. సర్పంచ్‌ను తీసేయడానికి !

Resort Politics : 40 రోజుల పాటు రిసార్ట్ పాలిటిక్స్ - ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు.. సర్పంచ్‌ను తీసేయడానికి !

Karnataka BJP: కర్ణాటక బీజేపీకి మరో గుజరాత్ అవుతుందా? హిమాచల్‌లా షాక్ ఇస్తుందా?

Karnataka BJP: కర్ణాటక బీజేపీకి మరో గుజరాత్ అవుతుందా? హిమాచల్‌లా షాక్ ఇస్తుందా?

Viral Video: వీడెవడండి బాబు, టవల్ కట్టుకుని మెట్రో ఎక్కేశాడు - వైరల్ వీడియో

Viral Video: వీడెవడండి బాబు, టవల్ కట్టుకుని మెట్రో ఎక్కేశాడు - వైరల్ వీడియో

Shraddha Murder Case: పోలీసులు సహకరించి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది - శ్రద్ధ తండ్రి వికాస్ వ్యాఖ్యలు

Shraddha Murder Case: పోలీసులు సహకరించి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది - శ్రద్ధ తండ్రి వికాస్ వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ- బండి సంజయ్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ-  బండి సంజయ్

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?