డాక్టర్‌కి ఝలక్ ఇచ్చిన పేషెంట్, నకిలీ నోటుతో ఫీజు కట్టాడు - సైలెంట్‌గా వెళ్లిపోయాడు
Fake 500 Rs Note: ఓ డాక్టర్‌కి ఫీజ్ కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చి పేషెంట్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు.
Fake 500 Rs Note:
రూ.500 నకిలీ నోటు..
డిజిటల్ చెల్లింపులకు అందరూ అలవాడు పడిపోతున్నా కొందరు మాత్రం ఇంకా కరెన్సీ నోట్లతోనే లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశమున్న చోట కూడా నోట్లు ఇస్తున్నారు. కొంత మంది కావాలనే దొంగ నోట్లు ఇచ్చి మోసం చేస్తుండగా..మరికొందరు తెలియకుండానే ఫేక్ కరెన్సీ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఇలాంటి అనుభవమే ఓ డాక్టర్‌కి ఎదురైంది. ఆర్థోపెడిక్ సర్జన్‌ని కన్సల్ట్ అయ్యేందుకు ఓ పేషెంట్ వచ్చాడు. డాక్టర్‌తో మాట్లాడిన తరవాత ఫీజు ఇచ్చి వెళ్లిపోయాడు. రూ.500 నోటు ఇచ్చాడు. ఆ తరవాత హాస్పిటల్ సిబ్బంది ఇది గమనించి డాక్టర్‌కి చెప్పింది. కానీ..ఆ డాక్టర్ సీరియస్ అవ్వకుండా దీన్ని లైట్ తీసుకున్నారు. పైగా...Threads యాప్‌లో ఇదంతా పంచుకున్నారు. ఓ పేషెంట్ చేసిన పనికి తనకు నవ్వొచ్చిందని పోస్ట్ పెట్టాడు.
"ఈ మధ్యే ఓ పేషెంట్ నన్ను కన్సల్ట్ అవ్వడానికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ రూ.500 నోటు ఫీజ్ కింద ఇచ్చాడు. మా రిసిప్షనిస్ట్ పెద్దగా పట్టించుకోలేదు. అయినా దొంగ నోటు ఇస్తారని ఊహించరు కదా. ఆ తరవాత గమనిస్తే అది ఫేక్ కరెన్సీ అని అర్థమైంది. ఏదేమైనా ఈ నోటు చూసి నాకు నవ్వు ఆగలేదు. ఈ నోటుని దాచుకున్నాను. ఇంకా హైలైట్ ఏంటంటే...ఈ నోట్‌పైన ఓ వైపు ఫర్ ప్రాజెక్ట్ స్కూల్ యూజ్ ఓన్లీ అని రాసుంది"
- డాక్టర్
ఈ పోస్ట్ పెట్టిన వెంటనే వందలాది లైక్స్ వచ్చాయి. కామెంట్లు వెల్లువెత్తాయి. బహుశా ఫర్జీ వెబ్‌సిరీస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ వ్యక్తెవరో కానీ చాలా ఇంటిలిజెంట్ అయ్యుంటాడు అని మరి కొందరు కామెంట్ చేశారు.
Post by @dr.mananvoraView on Threads
ఏటీఎంలో దొంగనోట్లు వస్తే ఏం చేయాలి? ఏటీఎంలో దొంగనోట్లు గుర్తించిన వెంటనే సీసీటీవీ ముందు నిలబడి నోటు ముందు, వెనకవైపు చూపించాలి. దొంగనోటు గురించి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి. ఆ ఏటీఎం లావాదేవీకి సంబంధించిన రిసిప్టును భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు వెళ్లి దానిని డిపాజిట్ చేయాలి. వారికి ఏటీఎం రిసిప్టు చూపించాలి. బ్యాంకు అధికారులు తమ నిబంధనలను అనుసరించి అసలు నోటును ఇస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి దొంగనోట్లు వస్తే సాధ్యమైనం త్వరగా కస్టమర్‌కు అసలు నోట్లు ఇవ్వాలి. బ్యాంకు ఇందుకు నిరాకరిస్తే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. దొంగనోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ (FICN)గా పిలుస్తారు. ఈ నోట్లను చలామణీలోకి తెస్తే జీవితఖైదు విధిస్తారు. ఐపీసీ సెక్షన్ 489C ప్రకారం ఇది నేరం. నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష విధిస్తారు. నోట్ల రద్దుకు ముందు బ్యాంకింగ్ వ్యవస్థలో 2012 నుంచి 17 మధ్యన ఏటా 5.21 లక్షలు, 4.98, 4.88, 5.94, 6.36, 7.62 లక్షల దొంగనోట్లను గుర్తించారు.
Also Read: ట్రైన్‌లో ఉండగా ఫోన్ లాక్కున్న దుండగులు, పట్టుకోబోయి కింద పడిన యువతి మృతి