Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు
Former Haryana CM: హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.
Former Haryana CM: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు దిల్లీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Ex-Haryana CM Chautala sentenced to 4 years jail in disproportionate assets case
— ANI Digital (@ani_digital) May 27, 2022
Read @ANI Story | https://t.co/fh6GO8siOv#Chautala #ExCMChautalaCase #Jail #Assetscase#ExHaryanaCM pic.twitter.com/aXcxMdHvPu
నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను కూడా సీజ్ చేయాలని పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టురూమ్‌కు ప్రత్యక్షంగా చౌతాలా హాజరయ్యారు. ఈ అక్రమాస్తుల కేసులో గతవారం చౌతాలాను దోషిగా నిర్ధరించారు స్పెషల్ జడ్జి వికాస్ ధుల్.
ఇదే కేసు
1999, జులై 24- 2005, మార్చి 5 మధ్య హరియాణా సీఎంగా చౌతాలా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అభియోగాలు మోపింది. చౌతాలా, ఆయన కుటుంబ సభ్యుల పేరుమీద మొత్తం రూ.1467 కోట్ల మేర ఆస్తులున్నట్లు గుర్తించింది. మొత్తంగా చౌతాలాకు రూ.6.9 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు లెక్కించింది.
ఎఫ్ఐఆర్లో పొందుపర్చినవే కాకుండా చౌతాలా కుటుంబానికి చెందిన చాలా ఆస్తులు అక్రమంగా సంపాదించినవని ఆరోపించింది. 2005లో చౌతాలాపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2010, మార్చి 26న ఛార్జి షీట్ దాఖలు చేసింది.
ఈ మొత్తాన్ని దేశవిదేశాల్లో వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. నగదు, నగలు కాకుండా 43 స్థిరాస్తులు పోగుచేసినట్లు సీబీఐ పేర్కొంది.
2013లో ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసుకు సంబంధించి 2013లో చౌతాలా జైలు పాలయ్యారు. 2000 సంవత్సరంలో 3,206 మందిని అక్రమంగా ఉపాధ్యాయులుగా నియమించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈ కేసుకు సంబంధించి ఓపీ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మంది శిక్ష అనుభవించారు.
Also Read: Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!
Also Read: Cruise Ship Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్!