Delhi Pollution Updates: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన కాలుష్యం,ఇప్పట్లో ఊరట ఉండదట!
Delhi Pollution: ఢిల్లీని మరోసారి కాలుష్యం కమ్ముకోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
![Delhi Pollution Updates: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన కాలుష్యం,ఇప్పట్లో ఊరట ఉండదట! Delhi Pollution News Air quality turns 'severe' again in delhi, no respite in sight Delhi Pollution Updates: ఢిల్లీని మళ్లీ కమ్మేసిన కాలుష్యం,ఇప్పట్లో ఊరట ఉండదట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/5cbe312bf29cdf95abe638f1a8450dfc1700114829584517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi Pollution News Updates:
ఢిల్లీ కాలుష్యం..
Delhi Pollution Updates: ఢిల్లీవాసులకు (Delhi Air Pollution) వర్షాలు కాస్త ఊరటనిచ్చాయి. ఊపిరి పీల్చుకునేందుకు వీలు దొరికింది. కానీ ఇంతలోనే మళ్లీ కాలుష్యం పెరుగుతోంది. క్రమక్రమంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. వారం రోజుల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయో..ఇప్పుడూ అలాగే ఉన్నాయి. గాలి నాణ్యత (Delhi Air Quality) Poor నుంచి Severe కేటగిరీకి చేరుకుంది. ఇప్పట్లో ఈ కాలుష్యం నుంచి ఊరట లభించేలా కనిపించడం లేదు. ముందు ముందు పరిస్థితులు మరింత దిగజారుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) లెక్కల ప్రకారం...ఆనంద్ విహార్‌లో AQI 430కి పడిపోయింది. ఆర్‌కే పురంలో 417,పంజాబీ బాగ్‌లో 423,జహంగిర్‌పురిలో 428 గా నమోదయ్యాయి. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న 13 హాట్‌స్పాట్‌లను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో Delhi Fire Services కి చెందిన ట్రక్‌లు గాల్లోకి నీళ్లు జల్లుతున్నాయి. అలా అయినా కొంత వరకూ పొగమంచు తగ్గిపోతుందని భావిస్తోంది. ప్రస్తుతం అక్కడున్న గాలిని పీల్చడం అంటే 10 సిగరెట్‌లు తాగినదానితో సమానం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ రచ్చ..
ఇక ఈ సమస్య రాజకీయాల్నీ వేడెక్కించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీపావళికి బాంబులు కాల్చకుండా కట్టడి చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది బీజేపీ. అందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Goapl Rai) తీవ్రంగా స్పందించారు. Delhi Pollution Control Committee (DPCC) మొత్తం 35 సిటీల్లోని కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. అందులో 24 సిటీలు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయి. కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కి వెళ్లారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కి వెళ్లారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)