అన్వేషించండి

Viral News: ఢిల్లీలో తుపాకీతో స్కూల్ కు వెళ్లిన విద్యార్థి, ఎందుకో తెలిస్తే షాక్!

Delhi News: ఇంట్లో ఉంచిన పిస్టల్ ను ఎవరూ పట్టించుకోలేదు. శనివారం బాలుడు తన తల్లికి పిస్టల్‌ను దాచిపెట్టి స్కూల్‌ బ్యాగ్‌లో ఉంచుకుని పాఠశాలకు తీసుకెళ్లాడు. తుపాకీని చూసిన తోటి పిల్లలు హడలిపోయారు.

Pistol Recovered From School boy : ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ద్వారకలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల బాలుడు పిస్టల్‌తో పాఠశాలకు వెళ్లాడు. స్కూల్ బ్యాగ్‌లో దాచుకున్న పిస్టల్‌ని తీసుకొచ్చాడు. క్లాసులో తుపాకీని బయటకు తీసి తన స్నేహితులకు చూపించాడు. తుపాకీని చూసిన తోటి పిల్లలు హడలిపోయారు. తరగతి ఉపాధ్యాయులకు పిల్లలు విషయం చెప్పగా బాలుడి దగ్గర్నుంచి తుపాకీ తీసుకుని విషయం పోలీసులకు చేరవేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి విచారణలో ఆ తుపాకీ తన తండ్రికి చెందినదని తేలింది. కాగా విద్యార్థి తండ్రి కొన్ని నెలల క్రితమే మరణించినట్లు గుర్తించారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు.

 ద్వారకా జిల్లా డిసిపి అంకిత్ సింగ్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన శనివారం జరిగింది. చిన్నారులు పిస్టల్స్‌ తీసుకుని వస్తున్నారనే సమాచారం పాఠశాల యాజమాన్యానికి చేరడంతో వారు షాక్‌కు గురయ్యారు. హడావుడిగా ఎలాగోలా చిన్నారి నుంచి పిస్టల్ లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.


తండ్రి పిస్టల్‌ బ్యాగ్‌లో పెట్టుకుని తెచ్చాడు
బాలుడి కుటుంబీకులను విచారించగా, అతడి తండ్రికి చెందినదని తేలింది. చిన్నారి తండ్రి కొన్ని నెలల క్రితం చనిపోయాడు. ఇంట్లో ఉంచిన పిస్టల్ ను ఎవరూ పట్టించుకోలేదు. శనివారం చిన్నారి తన తల్లికి పిస్టల్‌ను దాచిపెట్టి స్కూల్‌ బ్యాగ్‌లో ఉంచుకుని పాఠశాలకు తీసుకెళ్లాడు. పిస్టల్‌ లైసెన్స్‌ రద్దు ప్రక్రియకు సంబంధించి పేపర్‌ వర్క్‌ జరుగుతోందని డీసీపీ తెలిపారు. అలాగే, ఈ ఘటన గురించి అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు.

 
పిస్టల్‌లో మ్యాగజైన్ లేదు 
చిన్నారి బ్యాగ్‌లో దొరికిన పిస్టల్‌లో మ్యాగజైన్ లేదు. తన భర్త తన పేరు మీద పిస్టల్‌ను కొనుగోలు చేశాడని, దాని లైసెన్స్‌ను కూడా తీసుకున్నాడని చిన్నారి తల్లి చెప్పింది. ఆమె భర్త కొన్ని నెలల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఈ పిస్టల్‌ను పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేసేందుకు భార్య బయటకు తీసింది. ప్రమాదవశాత్తు పిస్టల్ తన కుమారుడి స్కూల్ బ్యాగ్‌లోకి వెళ్లిందని బాలుడి తల్లి చెప్పింది. ఇదేంటని విద్యార్థిని ప్రశ్నించగా.. అది బొమ్మ పిస్టల్‌గా భావించి బ్యాగ్‌లో పెట్టుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ఆయుధం లైసెన్స్‌ని తనిఖీ చేశారు. విచారణలో పిస్టల్ లైసెన్స్ సరైనదని తేలింది. అలాగే, ఈ కేసులో ఎలాంటి నేరం జరగలేదని తేలింది. దీని తరువాత, పిల్లవాడి తల్లి స్వయంగా పిస్టల్‌ను నజఫ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లోని మల్ఖానాలో డిపాజిట్ చేసింది.


బీహార్‌లో మూడో తరగతి విద్యార్థి కాల్పులు 
ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని సుపాల్‌లో నర్సరీ  చదువుతున్న చిన్నారి తన ఇంటి నుండి పిస్టల్ తీసుకువచ్చారు. ఈ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన తర్వాత ఈ ఏడాది మేలో యూపీలో ఓ పదేళ్ల చిన్నారి ఇంట్లో దొరికిన తుపాకీతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన 16 ఏళ్ల సోదరిని కాల్చి చంపాడు. అదే నెలలో లక్నోలో 12వ తరగతి చదువుతున్న ఓ బాలుడు గదికి తలుపు వేసుకుని తుపాకితో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు. పోలీసులు అతికష్టం మీద అతడిని రక్షించారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారి బ్యాగ్‌లను చెక్‌ చేస్తూ ఉండాలని సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget