అన్వేషించండి

Delhi Blast News: ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ఓ కారు ధ్వంసం - హై అలర్ట్

Blast at CRPF School In Delhi | ఢిల్లీలో ఆదివారం ఉదయం సీఆర్పఎఫ్ స్కూల్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కారు, షాపు ధ్వంసమైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Blast Reported Outside CRPF School In Delhi | ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పేలుడు ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ పాఠశాల బయట పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు తెలస్తోంది. స్కూల్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. స్కూల్ గోడలు దెబ్బతిన్నాయని.. అయితే పేలుడు దేని వల్ల సంభవించింది అని పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్కూల్ ముందు నిలిపి ఉన్న ఓ కారుతో పాటు సమీపంలో ఉన్న ఓ షాపు ధ్వంసం అయ్యాయి.

ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు సంభవించిందని ఉదయం 07:47 గంటలకు ఫోన్ కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్ ఆఫీసర్, సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి పక్కనే పార్క్ చేసిన ఓ కారుతో పాటు, సమీపంలోనే ఉన్న దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. ఫైరింజన్ సైతం అందుబాటులో ఉంచామని పోలీసులు తెలిపారు. 

రోహిణిలో పేలుడుపై డీసీపీ ఏమన్నారంటే..
ప్రశాంత్ విహార్ లోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడుపై రోహిణి డీసీపీ అమిత్ గోయల్ స్పందించారు. పేలుడు సంభవించిన విషయం నిజమే. అయితే ఏ రకమైన పేలుడు, అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నాయని డీసీపీ తెలిపారు. 

Also Read: Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget