సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం మాకుంది, కాంగ్రెస్ సవాల్‌కి రాజ్‌నాథ్ కౌంటర్
India China Border Conflict: భారత్ చైనా సరిహద్దు వివాదంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
India China Border Conflict:
లోక్‌సభలో చర్చ
భారత్ చైనా సరిహద్దు వివాదంపై (India China Border Dispute) చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ వివాదంపై కేంద్రం మాట్లాడాలంటూ చాలా రోజులుగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లద్దాఖ్‌లో చైనా ఆక్రమణలకు పాల్పడుతోందని, మోదీ సర్కార్ మాత్రం సైలెంట్‌గా ఉంటోందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై పదేపదే విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ సాక్షిగా ఈ ప్రకటన చేశారు. చైనా సరిహద్దు వివాదంపై సభలో తనకు చర్చించే ధైర్యం ఉందని తేల్చి చెప్పారు. చంద్రయాన్ 3 సహా అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే సరిహద్దు వివాదాల గురించి మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్. దేశ సరిహద్దుల్ని రక్షించుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చైనా అంశం ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ సమాధానమిచ్చారు.
"భారత్ చైనా సరిహద్దు వివాదంపై చర్చించేందుకు నాకు పూర్తి ధైర్యం ఉంది. సరైన విధంగా చర్చించగలను అన్న విశ్వాసం కూడా ఉంది"
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి
దాదాపు రెండున్నరేళ్లుగా భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది.
#WATCH | "Poori Himmat hai…China pe bhi..Mein charcha karne ke liye taiyaar hun aur seena chauda karke charcha karne ke liye taiyaar hun...," says Defence Minister Rajnath Singh to Congress MP Adhir Ranjan Chowdhury who asks him if he has the courage to discuss China issue in… pic.twitter.com/PnSaGgicg7
— ANI (@ANI) September 21, 2023
భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. గల్వాన్ లోయ ఘటన తరవాత రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. అప్పటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది చైనా. అందుకు దీటుగానే బదులిస్తూ వచ్చింది భారత్. అవసరమైతే ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటామని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోడానికీ రెడీగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే దాదాపు 18 రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. వీటి వల్ల కొంత మేర ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ పూర్తిగా యుద్ధ వాతావరణం సమసిపోలేదు. అందుకే...G20 సదస్సు ముగిసిన సమయంలో భారత్ చైనాకి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. లద్దాఖ్‌లోని న్యోమా వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కంబాయ్ ఎయిర్‌ఫీల్డ్‌ని (Nyoma Combat Airfield) నిర్మించనున్నట్టు ప్రకటించింది. LAC వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న ఇలాంటి కీలక తరుణంలో భారత్ ఈ ప్రకటన చేయడం చైనాకు సవాలు విసరనుంది. Border Roads Organization (BRO) తూర్పు లద్ధాఖ్లోని న్యోమ బెల్ట్ వద్ద ఈ ఎయిర్‌ఫీల్డ్‌ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.218 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిజానికి తూర్పు లద్దాఖ్‌లోని Nyoma Advanced Landing Groundని మూడు సంవత్సరాలుగా భారత్ వినియోగిస్తోంది. బలగాలను, మెటీరియల్‌ని తరలించేందుకు ఈ గ్రౌండ్‌ని ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఓ కంబాట్ ఫీల్డ్నే నిర్మించాలని ప్లాన్ చేస్తుండటం ఉత్కంఠగా మారింది.
Also Read: కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు